పుట:Neti-Kalapu-Kavitvam.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

నామాధికరణం.

పేర్లు.

పుల్లయ్య, రామయ్య, సీతయ్య అనే మనుషులపేర్లు యదృచ్చాసంజ్ఞలు పుల్లయ్యలో పుల్లలేదు రామయ్యలో దాశరథిత్వం లేదు. సీతమ్మకు జానకీత్వం లేదు. కాని కావ్యనామాలు వస్తుధర్మాన్ని అనుసరించి యేర్పడుతున్నవి. రామకథ రామాయణం భరతవంశస్థులకథ భారతం రఘువంశాన్ని అధికరించి రచించినది. రఘువంశం ఈతీరున కావ్యనామాలు వస్తు ద్యోతకంగా వుండడం వుచితం కాని యిప్పుడు జడకుచ్చులని, సంధ్యారాగమని సెలయేటిగానమని తమకు ప్రియమైన పేర్లన్నీ కావ్యాలకు పెట్టుతున్నారు. అది అప్రశస్తం.

పూర్వపక్షం

యదృచ్ఛానామాలు మనుషులకే పెట్టవలె నని నియమమేమిటి? పుస్తకాల కెందుకు పెట్టగూడదు?

యెవరికింపైనపేర్లు వారు కవిజనమనోభిరామమని జడకుచ్చులని అవి అని ఇవి అని పెట్టుకొంటారు అని వాదిస్తారా?

సమాధానం

చెప్పుతున్నాను మనుష్యసంజ్ఞలు కేవలవ్యవహారం కొరకు. కావ్యసంజ్ఞలు కావ్యవస్తుగ్రహణంకొరకు మనిషి తనయింటికి తనకుటుంబానికి హక్కుదారుడై వాటికి బద్ధుడై వుంటాడు. మహాపురుషులెవరైనా యింటిని దాటి లోకానికి దృష్టి మరల్చవచ్చును. అప్పుడు వారికి పరమహంసలని లోకమాన్యులని గుణవాచకాలు అనేకుల విషయంలో ప్రయుక్తమవుతునేవున్నవి కావ్యం ఒకమనిషికిగాని ఒక కుటుంబానికిగాని వుద్దేశించిందిగాదు. అది లోకానికి ఉద్దిష్టం