పుట:Neti-Kalapu-Kavitvam.pdf/76

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


శ్రీ ర స్తు

వాజ్మయపరిశిష్టభాష్యం

నామాధికరణం

పే ర్లు

     పుల్లయ్య రామయ్య సీతయ్య అనే మనుషుల పేర్లు యదృచ్చాసంజ్ఞలు పుల్లయ్యలో పుల్లలేదు రామయ్యలో  దాశరధిత్వం లేదు. సీతమ్మకు జానకీత్వం లేదు. కాని కావ్యనామాలు వస్తుధర్మాన్ని అనుసరించి యేర్పడుతున్నవి. రాకకధ రామాయణం భరతవంశస్థులకధ భారతం రఘువంశాన్ని అధికరించి రచించినది. రఘువంశం ఈతీరున కావ్యనామాలు వస్తు ద్యోతకంగా వుండడం వుచితం కాని యిప్పుడు జడకుచ్చులని, సంధ్యారాగమని నెలయేటిగానమని తమకు ప్రియమైన పేర్లన్ని కావ్యాలకు పెట్టుతున్నారు. అది అప్రశస్తం.

పూర్వపక్షం

     యదృచ్చానామాలు మనుషులకే పెట్టవలెనని నియమమేమిటి? పుస్తకాల కెందుకు పెట్టగూడదు?
  యెవరికింపైనపేర్లు వారు కవిజనమనోభీరామమని జడకుచ్చులని అవి అని ఇవి అని పెట్టుకొంటారు అని వాదిస్తారా?

సమాధానం

     చెప్పుతున్నాను మనుష్యసంజ్ఞలు కెవలవ్యవహారం కొరకు కావ్యసంజ్ఞలు కావ్యవస్తుగ్రహణం కొరకు మనిషి తనయింటికి తనకుటుంబానికి హక్కుదారుడై వాటికి దృష్టి మరల్చవచ్చును. అప్పుడు వారికి పరమహంసలని లొకమాన్యులని గుణవాచాకాలు అనేకుల విషయంలో ప్రయుక్తమవుతునేవున్నవి  కావ్యం ఒక మనిషికిగాని ఒక కుటుంబానికిగాని వుద్దేశించిందిగాదు. అది లోకానికి ఉద్దిష్టం