పుట:Neti-Kalapu-Kavitvam.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ర స్తు

వాఙ్మయ సూత్ర పరిశిష్టం.

ప్రథమాధ్యాయం.

నేటికాలపు కవిత్వం

1. నేటికాలపు కవిత్వాన్ని విచారణచేస్తాను

2. నూతనత్వం కవిత్వధర్మం

3. విస్తరం వికారాలు అనుచితపు పేర్లు ఊగుడుమాటలు నిదర్శనపరం పరలు అయోమయత్వం పులుముడు శబ్దవాచ్యత దృష్టిసంకోచం అనేవాటితో ప్రాయికంగా యీ కాలపుకవిత్వం దుష్ఠం

4. ఈ కాలపుకృతు లనేకాలు చాటుపద్యసంచయాలు; చాందసపు మాటలు కావ్యత్వసిద్ధిపొందినవి విరళం. ఉత్తమమధ్యమాలూ విరళం

5. వీట్లో తరుచుగా భాషావ్యతిక్రమం కనబడుతున్నది

6. ఇది ఉపలభ్యమానకృతుల్లో నన్నయభారతంలో ఆరబ్దం

7. ఛాందసాలు ఈ కాలపుకృతుల్లో బహుళం

8. నిర్భర్ధ వళిప్రాసలమైత్రుల అవర్జాలు ఛందోవ్యతిక్రమం వీట్లో కనబడుతున్నవి

9. భాషావ్యతిక్రమంవలె యివికూడా ఉపలభ్యమాన కృతుల్లో నన్నయ భారతంలో అరబ్ధం

10. పులుముడు మొదలైనదోషాలకీ ఛందోవ్యతిక్రమాదులు హేతువు

11. భారతీయభావకావ్యం ప్రాచీనం

12. పాశ్చాత్యభావకావ్యానికి పైన భారతీయభావకావ్యం ఔచిత్యవంతం