పుట:Neti-Kalapu-Kavitvam.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేటికాలపు కవిత్వం

3

13. కావ్యం ప్రవృత్తిమార్గ ప్రధానసాధనం

14. నివృత్తిసాధనంగూడా నని కొందరు

15. శృంగారం జగదవిచ్చిన్నతారూప ధర్మప్రతిపాదకం

16. సాధారణ నాయకావలంబనం చిల్లరశృంగారమని క్షుద్రశృంగారమని యిక్కడ వ్యపదేశం

17. దుష్టనాయకాశ్రయం హేయశృంగారం

18. లోకోత్తర నాయకాశ్రయంవల్ల పరిపోషాతిశయమని విద్యానాథుడు

19. అది ఉత్తమ ప్రకృతి ప్రాయమని విశ్వనాథుడు

20. అదమనాయకాశ్రయం రసాభాసమని ప్రాచీనులు

21. అది అంగంగా కావ్యంలో ఉండదగినది

22. ఈ కాలపు కృతుల్లో ప్రాయికంగా క్షుద్రశృంగారం అంగి

23. అనౌచిత్యం రసభంగానికి ముఖ్య హేతువని ఆనందవర్దనుడు

24. అది యీకాలపుకృతుల్లో తరుచుగా కనబడుతున్నది

25. భారతీయకావ్యాలకు వనసీమలు చిరపరిచితం

26. ఉపోద్ఘాతకర్తలను కృతికర్తలాశ్రయించడం బహుళం

27.వక్ష్యమాణం చౌర్యం ఈకాలపుకృతుల్లో తరుచు

28. అన్యత్ర స్థితి దోషానికి ఉపాదేయత్వం లేదు

29. ఆంధ్ర దేశంలో భారతీయసంస్కారం క్షీణం

30. వక్ష్యమాణమైన పాశ్చాత్య భారతీయసంస్కారాల సమ్మేళనం మృగ్యం

31. నన్నయ పెద్దనాదుల భారతమనుచరిత్రాదుల స్వరూపం వాటి హేయోపాదేయతా విచారితపూర్వం

32. ఆంధ్రుల్లో సంస్కారోజ్జీవనం కార్యం కార్యం

అని శ్రీమదక్కి రాజు లక్ష్మినారాయణపుత్ర ఉమాకాన్త విద్యాశేఖర ప్రణీతమైన వాఙ్మయసూత్ర పరిశిష్టంలో ప్రథమాద్యాయం.