పుట:Neti-Kalapu-Kavitvam.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రీ ర స్తు

వాజ్మయ సూత్ర పరిశిష్టం.

ప్రధమాధ్యాయం.

నేటికాలపు కవిత్వం

1. నేటికాలపు కవిత్వాన్ని విచారణచేస్తాను

2. నూతనత్వం కవిత్వధర్మం

3. విస్తరం వికారాలు అనుచితపు పేర్లు ఊగుడుమాటలు నిదర్శనపరం పరలు అయోమయత్వం పులుముడు శబ్దవాచ్యత దృష్టిసంకోచం అనేవాటితొ ప్రాయికంగా యీ కాలపు కవిత్వం దుష్ఠం

4. ఈ కాలపుకృతు లనేకాలు చాటుపద్యపంచయాలు; చాందసపు మాటలు కావ్యత్వసిద్ధిపొందినవి విరళం ఉత్తమమధ్యమాలూ విరళం

5. వీట్లో తరుచుగా భాషావ్యతిక్రమం కనబడుతున్నది

6. ఇది ఉపలభ్యమానకృతుల్లో నన్నయభారతంలో ఆరబ్దం

7. చాందసాలు ఈ కాలపుకృతుల్లో బహుళం

8. నిర్భర్ధ వభిప్రాపలమైత్రుల అవర్జాలు చందోద్యతిక్రమం వీట్లో కనబడుతున్నవి

9. భాషావ్వతిక్రమంవలె యివికూడా ఉపలభ్యమాన కృతుల్లో నన్నయ భారతంలో అరబ్ధం

10. పులుముడు మొదలైనదొషాలకి చందోవ్యతిక్రమాదులు హేతువు

11. భారతీయభావకావ్యం ప్రాచీనం

12. పాశ్చాత్యభావవికాసానికి పైన భారతీయభావ కావ్యం ఔచిత్యవంతం