పుట:Neti-Kalapu-Kavitvam.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


మొదలైన వాటి పాలుగావడం అజ్ఞానం. భావనావిభుత్వంతో ఉదాత్త భావ ప్రకర్ష రూపమైన రొమాంటికు కవిత భారత వర్ష సాహిత్యంలో చిరకాలం నుండి ప్రతిష్టమై వున్నదని తెలిపినాను. వాచ్యరమణీయతా ప్రకారమైన యీ రొమాంటికు కవిత భారత వర్ష దృష్టి ప్రకారం సాధారణంగా కొంచె మెచ్చుతక్కువగా భారత వర్ష సాహిత్యంలో గుణీభూత వ్యంగ్య కోటిలో చేరుతున్నది. కాళిదాసాదుల్లో గుణీభూత వ్యంగ్య దశ గూడా గడచి సత్వోన్నతి గల వ్యంగ్య దశగూడా గుణీభూత వ్యంగ్యం కంటే పరిణతమైనది. కవితకు భారతవర్షసాహిత్యంలో చిరకాలం కిందటనే వర్తించగలిగింది. కవితా దశలు జాతుల సంప్రదాయాలతో సంబద్ధమయ్యే వున్నవి.

సత్వశ్రేయః పరమత్వాన్ని అనుభవించగలిగిన భారతవర్షం కవితలో తదను రూపమైన వ్యంగ్యదశను దర్శించగలిగింది. యూరోపు ఖండం యొక్క యేసంప్రదాయాల పరివర్తనం వల్ల కవితకు ప్రస్పుటంగా యీ దశా పరిణామం సిద్ధిస్తుంది? అనే విచారణ నాకిక్కడ అప్రసక్తం యూరోపు ఖండ సాహిత్య ప్రశంస యింతటితో వదులుతున్నాను.

అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖర కృతిలో వాఙ్మయ సూత్ర

పరిశిష్టంలో భావనాధికరణ సమాప్తం.