పుట:Neti-Kalapu-Kavitvam.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావనాధికరణం

241

"We are bound to admit that we apply the term "Romantic" to words worth in a sense very different from that in which we use it of Coleridge, in Rousseau or Herder in a sense very different from that in which we give to Chateaubriand or Burger or Tieck"

(రొమాంటికు అనే పదాన్ని వర్డ్సువర్తుకు వర్తింపజేసి దానికంటే భిన్నమైన అర్ధంలో కోలగిడ్జికి షెటూబ్రియాండు, బర్గరు టీకు అనే వారికి వర్తింపజేసే దానికంటే భిన్నమైన అర్ధంలో రూసో హార్డురులకు అన్వితం జేస్తున్నామని మన మొప్పుకొనక తప్పదు) అని చార్లెసు యెడ్వినువాహను (Charles Edwin Vaughan) వ్యక్తం చేస్తున్నాడు. రొమాంటికు-అంటే-ప్రకృష్ట భావనా పాటన విశిష్టమైన - కవిత భారత వర్షానికి కొత్తగాదని ఉత్తర రామచరిత్ర కర్తృ ప్రభృతులు రొమాంటికు కవులని విశదపరచాను. అయితే కలిశకం 49- వ శతాబ్ది (క్రీస్తుశకం 18-వ శతాబ్ది) ప్రథమ భాగంలో యూరపు దేశాల్లో కావ్య రచనయందేర్పడ్డ భావజాడ్యం అక్కడ తిరస్కార్యమైనట్లు నన్నయాదుల భారతాభాసాలు మొదలైనవాటిలో ఆరంభించి రాను రాను వికృతరూపం పొంది తెలుగుకృతుల నావరించి వున్న బావజాడ్యం వాస్తవంగా త్యాజ్యమేను. ఆంధ్ర జాతియొక్క సర్వేతిహాసంతో ఈ భావజాడ్యం సంబద్దమైవున్నది.

దీన్ని వాఙ్మయసూత్రంలో ప్రధమ ద్వితీయ ఖండాల్లో విశదంచేశాను. తెలుగు దేశపు ఆ భావజాడ్యం తిరస్కార్యమైతే యిప్పటికృతుల్లో వున్న చిల్లర శృంగారం పులుముడు శబ్దవాచ్యత అయోమయం దృష్టి సంకోచం, ఊగుడు మాటలు మొదలైన కల్మషం అంతకంటే నూరు రెట్లక్కువగా తిరస్కార్యమంటున్నాను. యూరోపు ఖండ సాహిత్య చరిత్ర భారత వర్ష సాహిత్య చరిత్ర అనుకొని భారత వర్షపు సాహిత్యానికి అంధులై చిల్లర శృంగారం పులుముడు అయోమయం