పుట:Neti-Kalapu-Kavitvam.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం

క్షుద్రకావ్యాధికరణం

చిల్లరకావ్యాలు, క్షుద్రకావ్యాలు

శృంగారం లోకశ్రేయస్సుకు సంబంధించిందని జగత్సంతతికి ఆధారమైన ప్రవృత్తిధర్మప్రతిష్ఠకు సాధనంగా శృంగారం ప్రవర్తిస్తున్నదని చిల్లరమనుషులు పాత్రలైతే యీఉదాత్తఫలాలుపోయి రసం పరిపోషం చెందక కావ్యం భ్రష్టమవుతున్న దని వ్యక్తంచేశాను. ఈ తీరుగా భ్రంశంపొందినవాటికి క్షుద్రకావ్యాలని చిల్లరకావ్యాలని వ్యపదేశం చేస్తున్నాను.

పూర్వపక్షం

వాచ్యం ప్రధానమైన కావ్యాన్ని క్షుద్రమని సాహిత్యవేత్తలన్నారు. మీరు చిల్లరపాత్రల శృంగారకావ్యాన్ని క్షుద్రమంటున్నారు ఇది సంప్రదాయ సమ్మతంగాదంటారా?

సిద్ధాంతం

చెపుతున్నాను నిజమే అర్ధవిచారాన్ని అనుసరించి అవ్యంగ్యమైన కావ్యాన్ని క్షుద్రమన్నారు. కావ్యంయొక్క క్షుద్రత్వం పాత్రలనుబట్టిగూడా నిర్ణయించవచ్చును. ఇట్లా అధమపాత్రనిష్ఠమైన శృంగారానికి రసాభాసమని సాహిత్యవేత్తలు పేరుపెట్టినారు. వారి సంజ్ఞప్రకారం యిది రసాభాసకావ్య మవుతుంది. రసాభాసకావ్యమనే పేరు ఈచిల్లర పాత్రల శృంగాం