పుట:Neti-Kalapu-Kavitvam.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


కావ్యాలకు మీకు సమ్మతమైతే దాన్నే స్వీకరించవచ్చును. నేను వీటిని క్షుద్రకావ్యాలంటున్నాను. అభిప్రాయం వొకటే గనుక పేరుబాబాధకం గాదంటున్నాను. ధర్మరక్షకత్వంగాని ధర్మప్రతిష్ఠగాని లేని చిల్లరమనుషుల శృంగారం క్షుద్రం గనుక ఆకావ్యం క్షుద్రమంటున్నాను.

క్షుద్రకావ్యాలు

యెంకిపాటలు మొదలైనవాట్లో చిల్లరపాత్రలశృంగారం గనుక అవి రసాభాసకావ్యాలంటున్నాను. చిల్లరకావ్యం శృంగారరసాభాష కావ్యం, క్షుద్రకావ్యం యీమూడు నేను సమానార్థంలో ప్రయోగిస్తున్నాను. రసాభాసకావ్యమన్న చోట శృంగార రసాభావమని సమన్వయం. ధుష్టుల శృంగారం అత్యంతం దూష్యం గనుక

"కావ్యాలాపాంశ్చ వర్జయేత్"

అనే వచనానికి గురి అవుతున్నది. నారాయణమ్మ నాయుడుబావ పాటలో నారాయణమ్మను లేవదీసిన జారుడైన నాయుడుబావకు పరకీయ మీది రతిని ఆపాట తెలుపుతున్నది. భారతిలో పకటితమైన శ్రీ ముక్కపాటి నరసింహశాస్త్రి కృతి లక్ష్మి అనే కథలో పరకాంత అయిన లక్ష్మిచేతిని ప్రకాశంపట్టుకొని యేమంటావంటే "కొన్నాళ్లకింద అయితే నీతోయెక్కడికైనా వచ్చేదాన్ని యిపుడు వయసుముదిరింది" అని అతడు పోయినతరువాత యేడుస్తుంది. యిట్లాటి తుచ్ఛస్త్రీల తుచ్ఛులశృంగారం

"సన్నాసన్నా గాజూలేవే నారాయణమ్మా నీ
 చిన్నాచిన్నా చేతులాకు నారాయణమ్మా".

అని యీఫక్కి మాటలకూర్పు కొంతసొంపుగావున్నా హేయకోటిలో చేరుతున్నవి. ఇట్లాటిశృంగారానికిదివరకు పేరు పెట్టకవిడిచినా యిక్కడ దుష్టశృంగారమని దీన్ని వ్యవహరిస్తున్నారు. తారాశశాంకవిజయం, నారాయణమ్మ నాయుడుబావపాట ముక్కపాటి నరసింహశాస్త్రి లక్ష్మి,