పుట:Neti-Kalapu-Kavitvam.pdf/238

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


203

క్షుద్రకావ్యాధికరణం

యివన్నీ ఒకటేరకం చివరనాలుగు నీతిమాటలున్నా వీటికి గ్రాహ్యత్వం సమకూర్చవు. విషంమీద నాలుగు తేనెబొట్లు వేసినంతమాత్రాన విషానికి విషత్వంబొదు. పైగాతేనెగూడా విద్షసంపర్కంచేత కలుషితమచ్వుతున్ంది. కనకనే యివి హేయకోటిలో చేరుతున్న వంటున్నాను.

ఇక తక్కిన చిల్లరపాత్రలశృంగారం గలవి యెంకిపాటలు మొదలైనవి క్షుద్రకావ్యాలన్నాను. వెంకమ్మ చంద్రమ్మ పాట ఓరోరి బండోడిపాట మొదలైనవి యెంకిపాటల కోటిలోనివి ఇవన్నీ ఈ చిల్లర కావ్యాలే అయువున్నవి. ఈక్షుద్రకావ్యాలను యెంకిపాటలుమొదలైనవి మచ్చుగా విమర్శ్ంచాను ధర్మసంబంధంఅ యెంకికి నాయుడుబావకు యెంకయ్యకు చంద్రమ్మకు వ్రాయకపోతే ఉన్నదని యెట్లా అనుకొనడం? అట్లయితే అసలు కావ్యం వ్రాయకుండానే వ్రాశాడను కోవచ్చు కనుక అవి సంబద్ధపుమాటలంటున్నాను. యెంకినాయ్డూ సంస్కారంలేని చిల్లరమనుషులని యింకా ముందు నిర్ణయించబోతున్నాను. యెంకమ్మ చంద్రమ్మ పాట మొదలైనవి యెంకిపాటలు యిట్లానే సాధారేణనాయకుల శృంగారంగల "చెన్నపట్టణంలో" వంటినవలలు, భారతి పత్రికలో ఆకోటిలోని "పరీక్ష" వంటి కధలు చిల్లరకావ్యాలని వ్యక్తపరిచాను. భగవందుడిమీద రతి శిశుప్రేమ ముగ్ధప్రకృతిప్రేమ, ఉత్తమూలభావదశాశృంగారం వీటికన్నిటికి భావద్వని అని సాహిత్య సంప్రదాయంలో పేరు. భావకావ్యమని కూడా అనవచ్చును. ఈ భావకావ్యాలు ఖండాఖండభేదంతొ మహాకవ్యమని ఖండకావ్యమని భేదంతో) ఉదాత్తకావ్యకోటిలోనే భారతీయసంప్రదాయాన్ని అనుసరించి చేరుతున్నవి.

భారతిలోని వెంకటేశవచనాలు కృష్ణకర్ణామృతం, సౌందర్యం హరి ఋతుసంహారం సూర్యశతకం మూకవిరచిత్మైన మూకసంచాశతి దూర్జటి కాళహస్తిశతకం. ఇవన్నీ భావకావ్యకోటిలోని నేటికాలపు