పుట:Navanadhacharitra.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxx

రంగనాథ రామాయణమునఁ గనఁబడుచున్నది. అక్కడ కృతిపతి కోన విఠలరాజు రామాయణమును “దన పేర' రచింపు మని బుద్ధారెడ్డితోఁ జెప్పినట్లు కలదు. కావున నాతఁ డట్లుచేసెను. ఆ ఫక్కి యే గౌరన మల్లికార్జునుని విషయమునఁ గూడ నవలంబించియుండును. హరిశ్చందద్విపదలోఁ బూర్వప్రబంధ రచనాసంప్రదాయములు పాటింపఁబడకున్నను, అందలి రచనాఫక్కి సంభాషణ శైలి, స్వభావోన్మీలనశ క్తి జాతీయపయోగనై పుణి, రసావిష్కరణ దృష్టి భావౌచిత్యపోషణము మొదలగునవి దీనినొక ప్రౌడప్రబంధముగఁ జేయుటయే గాక గౌరనామాత్యునికిఁగల “సరససాహిత్య లక్షణవిచక్షణుఁడను" బిరుదును సార్థకము చేయుచున్నవి. నవనాథచరిత్ర యాతని తొలిరచన యగుటచేతనో, అది మఱియొక కావ్యమున కనుసరణమగుటచేతనో యొక విధమగు మత గ్రంథముగాఁ బరిగణింపఁ బడుటచేతనో, గౌరన పరిణత కవితారచనాశక్తి దీనియందంతగాఁ గనఁబడుటలేదు; కాని భావములయందు పోకడలయందు నీ రెంటికిని విశేషసామ్యము కల దనుట క నేకనిదర్శనములు కలవు. కొన్నిచోటుల నొక దానిలోని వాక్యములును ద్విపదభాగములును మఱియొకదానిలోఁ గనఁబడుచుండును. శాంతరాయల కొలువును వర్ణించు సందర్భమున నాతఁడు,

“కర్పూర హిమజల కాశ్మీరమిళిత
 దర్పసారాంబుసిక్త ప్రదేశమును
 దపనీయ జాలకాంతరగత ధూప
 విపుల సౌరభసమన్విత గంధవాహ ...
 భాసిల్లునిజ సభాభవనంబునందు
 శ్రీసముజ్జ్వల రత్నసింహాసనమున
 నాసీనుఁడై యుండె.”

హరిశ్చంద్ర ద్విపదలో దేవేంద్రుఁడును.......

"గలిగి నానాధూప గంధ బంధురముఁ
 గర్పూరచందన కాళ్మీరమిళిత
 దర్పసారాంబు సిక్తప్రదేశంబు
 నిరుపమ నిజసభానిలయంబునందుఁ
 బరఁగు చింతామణి భద్రపీఠమునఁ
 దనరనాసీనుఁడై " యుండె నని వర్ణింపఁబడెను.

గంగావర్ణనము.

నవనాథ చరిత్ర - "అలినీల కుంతలి నావర్తనాభిఁ
                       గమనీయచక్రవాక స్తనిం జారు
                       కుముదగంధిని బినకోమలహస్త
                       నతులశైవాల రోమావళీ కలిత