పుట:Navanadhacharitra.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxix

 నురుచిర మధుర వచోవిలాసముల
 గుణశీలములను సద్గుణకలాపముల”

నలవడ్డవాఁడెవ్వఁడని విచారించి నాఁడఁట. పిదప, గౌరనాహ్వయుఁ బిలిపించి నవనాథచరితంబు ద్విపదకావ్యముగాఁజెప్పి శంకరున కంకితం బొనరింపు మన్నాఁడు. దీనినిబట్టి సప్తసంతానములలో నొకటి గావున నొక కృతి రచింపఁ దలఁచితినని చెప్పుకొనుట, సరససాహిత్యలక్షణ వివేకము లలవడ్డ వాఁడెవ్వరని విచారించి శాంతరాయఁడు తెలిసికొనవలసి వచ్చుట, మొదలగునవి యిది యీతని తొలిరచనయే గావచ్చుననిపించు చున్నవి. హరిశ్చంద్ర రచనాకాలమునాఁటికీతఁ డీ బాహ్యాడంబరముల నన్నిటినివదిలిపెట్టినను, సరస సాహిత్యలక్షణ విచక్షణుఁడను బిరుదవిఖ్యాతిచేఁ బెంపొందిన వాఁడ'నని చెప్పి కొన్నాఁడు. ఇప్పటి కితనికి స్వీయరచనాపటిమయందు నమ్మకము గూడఁ జిక్కి,నట్లున్నది. కావుననే యీ కావ్యమును దన కవితా చమత్కృతిఁగాంచిహర్షించి కవులందఱును శిరఃకంపంబుసేయఁ బచరించి వీనులపండువుగాఁగ నీకావ్యమును విరచింతు' నన్నాఁడు. దీనిని వెనుకటిదానివలె చరిత్ర కథనము మాత్రముగాఁ గాక, కవితాచమత్కృతినిజూపుచు రసవంతమైన ప్రౌఢప్రబంధముగాఁ జేయ వలయుననియే యీతఁడుతలపెట్టిన ట్లగపడుచున్నది. దానికిఁ దగినట్లుగనె తొలి కావ్యమందు బాణాదికవులను దలఁచిన వాఁడీ హరిశ్చంద్ర ద్విపదలో కాళిదాసాదులగు మహాకవుల" నభిమతసిద్ధికిఁ దలంచినాఁడు. నవనాథ కథాకథనసందర్భమున బాణుని, కవులకు శిరఃకంపంబు గలిగింపఁగల రసవత్కావ్యరచనా సందర్భమునఁ గాళిదాసును స్మరించుట యుక్తంబే గదా! శివకవులు వాస్తవముగా భవికవులను స్మరింపనే స్మరింపరు. గౌరన యితరశైవకవులవలె నాంధ్రకవులను స్మరింపలేదుగాని, బాణ కాళిదాసులను మాత్రమెట్లో స్మరించినాఁడు. ఈతఁనికి శైవమునందంత పట్టుదల లేనట్లున్నది. ఋగ్వేదకాలము నుండియుఁ బ్రసిద్ధంబై యుండిన హరిశ్చంద్రకథను జెప్పుదుననుచు, దానిని విశేషముగా స్మరించినాఁడు. హరిశ్చంద్రలోఁ గృతిపతియే లేక పోవుటచేఁ గాఁబోలు, షష్ఠ్యంత రచన మొదలగువానిని బాటింపకున్నను నవనాథచరిత్రమున షష్ఠ్యంతములతో "సర్వజ్ఞునకు ముక్తిశాంతరాయనికి ” అనవరతాభ్యుదయాభివృద్ధిని గోరి, “శ్రీ మల్లికార్జున శ్రీ మహాదేవుపేరఁ" దన గ్రంథమును రచించెను. సోమనాథాదుల కృతులలో షష్ఠ్యంతములు లేవు. కృత్యాదిని ఆశ్వాసాంతమునను గూడఁ గృతిపతినిగూర్చిన సంబోధనలు మాత్రముకలవు. పూర్వకవుల ప్రబంధ ఫక్కి నెఱింగినవాఁ డగుటచేఁ గాఁబోలు, గౌరన షష్ఠ్యంతములను గ్రంథరచనను బ్రోత్సహించిన శాంతరాయనియెడలఁ బ్రయోగించి, యాతని కభ్యుదయాభివృద్ధులనొసఁగు శ్రీగిరిభర్త పేరగ్రంథమురచింతునని వాక్యాన్వయమును గుదుర్చుకొనినాఁడు. ఇట్లు కృతిపతి ' పేర' రచించుఫక్కి ద్విపదలలో