పుట:Navanadhacharitra.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

129

నలయక వేదశా ◆ స్త్రాభ్యాసనిరతి
సలుపుము దినమును ◆ సజ్జనగోష్ఠిఁ
బాయక యతిథిస ◆ పర్య లెప్పుడును
జేయుము సుకృతసు ◆ [1]తృప్తులఁ బొంద
నెల్లభూతంబుల ◆ యెడ దయ మీఱ
నుల్లసిల్లుము భక్తి ◆ నుడురాజధరుని
మన్మథాంతకుని సం ◆ మాన్యప్రభావుఁ
జిన్మయాత్ముఁ [2]దలంపు ◆ చిత్తమునందు
నని బుద్ధిచెప్పి ని ◆ జాంగనకేలు
తనకేలఁ దగిలించి ◆ తనయునిఁ జూపి
వనిత యీతఁడు పిన్న ◆ వాఁ డీమహోగ్ర
వనము భయంకర ◆ వ్యాళశార్దూల
భూతసంకుల మొంటిఁ ◆ బోనీకు మవుల
నాతతకందమూ ◆ లాహరణార్థ
మిటమీఁద వలవదు ◆ మీకు నిం దుండఁ
బటుబుద్ధి సన్ముని ◆ ప్రవరాశ్రమమున
వసియింపుఁ [3]డిఁకఁ దరు ◆ వాతికృత్యంబు
లెసఁగింపు కులశీల ◆ మేమర కుండు
మని వెండియును వసు ◆ ధాధీశు ముఖముఁ
గనుఁగొని యావాల్మె ◆ కంబు బారికినిఁ
బాపి రక్షించి తీ ◆ పణఁతిని శిశువు
నేపారఁ గరుణమై ◆ నిఁక వీరి నొక్క
మునియాశ్రమము చేరు ◆ పుము నీకు నొదవు
ననుపమసకలయో ◆ గాధిక ఫలము
లనుచు మహాదేవు ◆ నంబికారమణు
మనమున నునిచి న ◆ మశ్శివాయ యని
విడిచెఁ బ్రాణంబులు ◆ విప్రుఁ డావేళఁ
దొడతొడ గన్నీరు ◆ దొరఁగ దైన్యంబు
మొగమున నెసఁగంగ ◆ ముదిరిన వగను
బొగులు తనూజుని ◆ ముద్దులమొగము
గుదిగొన్న కూర్మి న ◆ క్కునఁ బలుమాఱు
గదియించి ముద్దిడి ◆ కన్నీరు దుడిచి

  1. సంతృప్తి బొగడొందు.
  2. త్మకు దలచుచు చిత్తమందు.
  3. తరవాదారి కృత్యంబు.