పుట:Navanadhacharitra.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

నవనాథచరిత్ర

భూనాయకునిఁ జూచి ◆ భూసురవనిత
మానవేశ్వర కృపా ◆ మతి నీకుమారు
మునియాశ్రమముఁ జేర్పు ◆ ముద మంద ననుచు
...... ...... ...... ...... ...... ...... ....... ...... ......
[1]గతిఁ గూడ ననలము ◆ ఖంబు కేగెదను
...... ...... ...... ...... ....... ...... ....... ...... .......
కడుకాలమును నుండఁ ◆ గాఁ జాల ననినఁ
బుడమీశుఁ డాత్మలోఁ ◆ బురపురఁ బొక్కి
యమ్మ నీ కిట్లాడ ◆ నగునె డెందమున
ముమ్మడిగొనుశోక ◆ మునఁ జాల బెంగ
విడిచినఁ బ్రాణముల్ ◆ విడుచు నీబాలుఁ
డుడుగు మీ కతనను ◆ నుత్తరక్రియలు
పరలోకగతుఁ డైన ◆ పతి నాత్మలోనఁ
బరమేశ్వరునిఁ బోలె ◆ భక్తి భావించి
మ్రొక్కుచు భూతలం ◆ బునఁ గడు వినుతి
కెక్క గంగాది వా ◆ హినులను గ్రుంకి
యమితతపోధను ◆ లైనసన్మునుల
కమరంగఁ బరిచర్య ◆ లర్థిఁ జేయుచును
బరమ [2]సంయమ వ్రత ◆ పాలనం బెసఁగ
జరుపుచు నడవడి ◆ జగములు పొగడఁ
జేకొని పుత్రుఁబో ◆ షింపుచు నుండు
నీ కుమారుం డుండ ◆ నిక్కంబు గాను
నీరజూనన నిన్ను ◆ నీ తనూభవుని
భోరునఁ దోడ్కొని ◆ పురమున కేగి
నూటి కొక్కటి నేర్చి ◆ నుతిమీఱఁ బాడిఁ
జాటువ కైక్కు[3] వ ◆ త్సల ధేనువులను
బెక్కింటిఁ జెచ్చెరఁ ◆ బ్రీతిగా నిత్తు
నిక్కంబు నావుడు ◆ నృపుని వీక్షించి
యా విప్రకాంత ◆ యిట్లనియె భూనాథ
నీవంటి సత్కృపా ◆ నిధి మాకుఁగలుగఁ
బతిలేని సుతు లేల ◆ ప్రాణంబు లేల
పతిలేని సకల సం ◆ పదలును నేల

  1. పతిగూడ.
  2. సంశయముల ప్రతి.
  3. మచ్చల.