పుట:Navanadhacharitra.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

నవనాథచరిత్ర

[1]పట్టికిఁ బత్నికి ◆ భయమెల్లఁ దీర్చి
వారిఁ దోడ్కొనిపోయి ◆ వసుమతీవిభుఁడు
ధారుణీసురుని ముం ◆ దటఁ దెచ్చి నిలిపి
తియ్యనిజలములు ◆ తెచ్చి వక్త్రమునఁ
జయ్యనఁ బోసి లో ◆ చనములఁ దడిపి
యలఁతఁదేర్చినఁ గన్ను ◆ లల్లనఁ దెఱచి
పొలఁతిఁ బుత్త్రునిఁ జూచి ◆ భూవిభుఁ జూచి
(యనఘా) త్మ మీరెవ్వ ◆ రయ్య [2]నావుండు
మనుజనాయకుఁడు బ్రా ◆ హ్మణున కిట్లనియె
యేనొక్కనృపుఁడ మ ◆ హీదేవతిలక
పూని కొలనిజలం ◆ బులను నేఁ గ్రోలఁ
గొలనిలో దిగఁబోయి ◆ కూలకుంజమునఁ
బులిఁ బొడగని యేయఁ ◆ బూని యున్నంత
నీవుఁ బుత్త్రుండును ◆ నెలఁతయు నీరు
ద్రావ నేతెంచి ముం ◆ దటఁ బరికించి
కనుగొననేరక ◆ ఘనతరవ్యాఘ్ర
మున కెదురైతి రా ◆ పులి యంతఁ బోక
వెస నీవధూమణి ◆ వెంటఁ బట్టుటయు
మసల కేసితి దాని ◆ మహీమీఁదఁ గూల
నీవంటిబహుపుణ్య ◆ నిధి కిటువంటి
చా వయ్యెనే యని ◆ సంతాప మందు
భూవరుఁ జూచి యా ◆ భూసురోత్తముఁడు
చావులు లే వనఁ ◆ జనదు చర్చింప
దేవతలకు నైన ◆ దీనికి నడల
నీవాలుమృగముచే ◆ నిట్టిదుర్మరణ
మగుటకు వగచెద ◆ నాత్మలో ననుచుఁ
దగిలి యేడ్చుచు నున్న ◆ తనయు వీక్షించి
[3]తనయు డగ్గఱఁ బిల్చి ◆ తన్ముఖాంబుజము
తనయురంబునఁ జేర్చి ◆ తార్కొన నెత్తి
యన్న నే నడిపెడి ◆ యాచారవిధులు
సన్నుతమతిఁ బూని ◆ జరుపు మీ వింక

  1. పట్టితాపసు భయమెల్లనుదీర్చి.
  2. దీని వ్రాఁతప్రతులలోఁ బెక్కుచోట్ల 'నావుండు' అనియే యున్నది.
  3. తనయ డగ్గరవచ్చి.