పుట:Navanadhacharitra.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

73

ఇంత పాపముసేసె ◆ నే మహీనాథుఁ
డింతటితోఁబాసి ◆ తే పట్టి యనుచుఁ
దలయూఁచి సుతుమోము ◆ తప్పక చూచి
తలవరులకు నెల్లఁ ◆ దగ నప్పగించు
నక్కఱం బచరించు ◆ నక్కునం జేర్చుఁ
జెక్కిలి నొక్కుచుఁ ◆ జెరఁపలు దీర్చుఁ
బోయెద నని లేచుఁ ◆ బోలేక మగుడుఁ
బోయెఁ బ్రాణము లని ◆ పొగిలి మూర్ఛిల్లుఁ
గ్రమ్మఱం దెలివొందుఁ ◆ గన్నీరు నించు
ముమ్మడి గొనుపుత్ర ◆ మోహంబుకతన
నట చనంగా లేక ◆ హాయని నిలుచుఁ
గటకటయని వగ ◆ గతుల రత్నాంగి
పొడగన్నవా రెల్లఁ ◆ బురఁబురఁబొక్క
నడలుచు మగుడి గృ ◆ హంబున కరిగి
[1]పుడమిపైఁ బలుమాఱు ◆ పొరలుచు బిట్టు
కొడుకుఁ బ్రలాపించు ◆ కొనుచుండె నంత
నడురేయి యగుటయు ◆ నగరరక్షకులు
తడయక సారంగ ◆ ధరుని బంధములు
సడలించి వీడిన ◆ జడఁ జక్క నల్లి
మొగలిఱేకులు మీఁద ◆ మురువుగాఁ జెరివి
మృగనాభితిలకంబు ◆ మెచ్చుగాఁ దీర్చి
పలుచగా గుంకుమ ◆ పంకంబు నలఁది
చెలువారు నెఱిపట్టు ◆ చీరఁ గట్టించి
పొలుపొంద భూషణం ◆ బులు చక్కదిద్ది
కలువపువ్వులదండ ◆ గళమున వేసి
[2]వెలయఁ గప్పురముతో ◆ వీడెంబు లొసఁగి
పటుఖడ్గ ఖేటక ◆ పాణులై యతని
నటు తోడుకొనుచును ◆ నరుగు నవ్వేళ
తఱచుగా శశముల ◆ తఱచుఁ జెండాడి
[3]తొఱుఁగు రేచులును క్రం ◆ దుగ గుంపుగూడి
యఱచు నక్కలు నిట్టు ◆ నట్టుగ బిట్టు
పఱచుతోడేళ్లును ◆ బటు[4]కుశాగ్రములఁ

  1. ఇటనన్వయము సరిపడుచున్నను నొకపాదము పోయినట్లున్నది.
  2. ఇటనన్వయము సరిపడుచున్నను నొకపాదము పోయినట్లున్నది.
  3. నుఱుకు.
  4. సభాగ్రముల.