పుట:Navanadhacharitra.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

నవనాథచరిత్ర

చావులులేవొకో ◆ [1]చనద యీ రీతి
దేవతలకు నైనఁ ◆ [2]దీరదె వగవ
విధి దిట్టు గుడువఁగా ◆ [3]వెదకె ని న్నిట్లు
వధకు నీ వర్హుండ ◆ వాని గుణాధార !
ఎవ్వరిఁ దొల్లి నే ◆ నేమి చేసితినొ
యివ్విధంబున వేఁగ ◆ నిప్పుడు వలసె
నని యిట్లు శోకాగ్ని ◆ నలయుచు నున్న
తన తల్లి వదనంబు ◆ తప్పక చూచి
యమ్మనేఁ జిత్రాంగి ◆ నంత రంగమున
నెమ్మితో భావింతు ◆ నీ మాఱుగాను
మాయమ్మ నన్నుఁ గా ◆ మాతురంబునను
డాయ వచ్చినఁ బొందఁ ◆ దగదు పొ మ్మనుచుఁ
బలుదెఱంగుల వేడఁ ◆ బడినఁ గైకొనక
తొలఁగి వచ్చితిఁ గాని ◆ దోష మే నెఱుఁగఁ
బోలు పొందెఱుఁగక ◆ భూవల్ల భుండు
ఆలిమాటలె నిక్క ◆ మని మది నమ్మి
యొప్పగించక నన్ను ◆ నూరక చంప
నొప్పించె సభవారు ◆ నున్నట్లు చంప
నరిమురిఁ దోఁచిన ◆ యప్పటి కొలఁది
నొరగ నాడిరి శివుఁ ◆ డొక్కఁడే యెఱుఁగుఁ
గన్న మోహంబునఁ ◆ గ్రాఁగుచు నీకు
నిన్నీ చదుదన్‌శ ◆ నిటకు రావలసె
మేదినీవిభు నాజ్ఞ ◆ మీఱి పోరాదు
రాదువో యిట్లుండ ◆ రత్నాంగి నీకుఁ
గలనైన నవనీశుఁ ◆ గల్లరి యనకు
చెలిమిఁ దప్పకు మమ్మ ◆ చిత్రాంగి దేవి
నాకూర్మి లెంకల ◆ నాయిష్టసఖుల
నాకయివడిఁ జూడు ◆ న న్నింక మఱవు
మడలక విచ్చేయు ◆ మని బుద్ధిచెప్పి
యడుగులం బడియున్న ◆ యక్కుమారకుని
గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చి ◆ కోరి దీవించి
[4]పుచ్చిహాయని యేడ్చె ◆ పోవుచు బిట్టు

  1. చనదు యీరీతి.
  2. దీనికి.
  3. విధికి నీవిట్లు.
  4. హాయనియేడ్చినా పోవంగబిట్టు.