పుట:Narayana Rao Novel.djvu/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

314

నారాయణరావు

రాజేశ్వరరావు నారాయణరావును కనుగొనగానే తెల్లబోయినాడు. అతనికి జిరుచెమ్మటలు పట్టినవి. ఒక్క పరుగునవచ్చి నారాయణుని కవుగలించు కొన్నాడు. ‘నారాయణా, నువ్వేనట్రా వచ్చింది! నువ్వేనట్రా! ఏమిటిది, ఎందుకు వచ్చావు, ఎల్లావచ్చావు? ఎప్పుడువచ్చావు? రా! రా! మా యింటికి వెళ్లావా? ఎవరున్నారు?’

‘వెళ్లాను. అక్కడున్న ఒక మహమ్మదీయ యువకుడు చాలా డాబుగా ఉన్నాడు. అతడూ, ఒక చక్కనిపిల్ల, పుష్పశీల కాబోలు, తేయాకుబల్ల ప్రక్క కుర్చీలలో కూర్చుని ఉన్నారు. నన్ను చూచి మహమ్మదీయ యువకుడు ఈవలికివచ్చి నువ్విక్కడున్నావని చెప్పాడు. నీ బంగళాకూ ఇక్కడకూ రెండు మైళ్లుందిరా, అబ్బా!’

వ్యాధికి మందు; ఆయువుకు మందు లేదు

సాధుశీల, సత్యహృదయ, సూరమ్మకు నెంతయో జబ్బు చేసినది. ఆమెకు పురిటిలో జేసిన జబ్బు నిశ్శేషము కాలేదు. చిక్కి శల్యమైనది. తిండి సహించుట లేదు. ఎప్పడు తలనొప్పులు, చిన్న చిన్న జ్వరములు.

రాజారావు తన భార్య పుట్టినింటికడ అలతి రోగములచే కృశించుచున్న దని, తనకడకు గొనివచ్చి, యామెకు వైద్యముచేయ నారంభించెను. బలమునకై మందులిచ్చెను. దేహములో నెచ్చటనైన రోగపదార్థమున్న దేమో యన్న భయాన స్ట్రెప్టోకాకయి మందు నరముల ద్వారమున లోనికిచ్చెను. క్షయ యేమో అని భయము పుట్టి జాగ్రత్తగ పరీక్ష చేసినాడు, ఎక్కడను ఆ జాడయైన లేదు. అంతకంతకు రోగము శ్రుతిమించి రాగమున బడినది.

మలేరియా జ్వరమేమోనని యాలోచన కలిగినది. సబ్ టెర్షియన్ మలేరియా యే జబ్బునైన అనుకరించును. అతడు క్వినయిను లోపలికి వాడినాడు, సూదివెంట నెక్కించినాడు. జ్వరము రోజుకు నూరుదగ్గర మొదలిడి నూటమూడు డిగ్రీల వరకు నెక్కుచున్నది. ఆమె జిక్కిపోకుండ ద్రాక్ష, పంచదార, కోడిగ్రుడ్డుసొన, బార్లీ నీరు, పాలు విరుగుడునీరు ఇవియన్నియు నామె కిప్పించు చుండెను. అత్తవారు వచ్చినారు. తన చుట్టములు వచ్చినారు. సూరమ్మకు జబ్బు విజృంభించింది. రాజారావు తన మిత్రులగు నిరువురు పేరుపొందిన వైద్యులకు తంతులనిచ్చి రప్పించుకొన్నాడు. వారువచ్చి యెడతెగక వైద్యము చేసినారు. ముగ్గురు జాగ్రత్తగ గ్రంథములు పరిశీలించి యాలోచించి వైద్యము చేసిరి. సన్నిపాత (టైఫాయిడు) జ్వరము కాదని నిర్ధారణ చేసినారు. రక్తము, మలము, ఉమ్మి గిండీకి పంపి పరీక్ష కూడ చేయించినారు.

ఊపిరితిత్తులు శ్లేష్మముచే నిండ, అయొడిను ఏఫిడ్రిను ఇచ్చినారు. తగ్గిపోయినది. గుండె అతి నెమ్మదిగా కొట్టుకొన్నది, నెమ్మదిగ ఏడ్రినాలిన్