పుట:Narayana Rao Novel.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప ర మే శ్వ ర మూ ర్తి

27

‘అప్పచెల్లెళ్లిద్దరూ వీరసతు లౌతున్నారు. ఆడవాళ్లు తలుచుకుంటే మొగాళ్లు మూలగదుల్లో దాగాలిసిందే’ అని సుబ్బారాయుడు గారు నవ్వుకొన్నారు.


౭ ( 7 )

పరమేశ్వరమూర్తి


పరమేశ్వరమూర్తి రాజారావును సామర్లకోట స్టేషనులో కాకినాడ బండి నెక్కించి, తానుబోయి మరల మెయిలులో గూర్చుండి నాడు. పరమేశ్వరమూర్తి పలుచని శరీరము, సొగసైన కన్నులు, పసిమిపచ్చరంగున గలియుటకు యత్నించు చామనచాయ, చీలిక గడ్డము, సమఫాలము, సన్నని పెదవులు, లెక్క పెట్టుటకు వీలున్న నల్లని మీసములుగల వాడు. చిన్న చెవులు, సన్నని పొడుగాటి కంఠము, విస్ఫారితము గాని భుజస్కంధము, గుండ్రని నున్నని కరములు, చిన్న చేతులుగల అతని కోమలశరీరమున నాడుదన ముట్టిపడుచుండును. ఈతలో ప్రథమ బహుమానమంది పోటుమానిసి యనిపించుకొను టొక్కటియే యాతని స్త్రీత్వమునకు దీరనికొఱత తెచ్చి పెట్టినది.

సహజ పంచమస్వనమున గంఠము తేనెలూర సంగీతము పాడుకొనును. నిత్య నవీనములై ఆర్ద్రము లైన ప్రకృతి విలాసము లాతని ధ్యానముద్రలో వికసించి మురిపించును.

ప్రకృతి యాతని యాలోచనాశక్తిని ప్రోవిసేయు పెంపుడుతల్లి. ప్రకృతిలో నే మార్పును జూచినను ఆతని హృదయము చలించిపోవును. సృష్టిలో ప్రతిపదార్ధమును పరమేశ్వరమూర్తికి మేరుపర్వత సమానమై గోచరించును. దృశ్యమానములగు ప్రకృతివికారము లెల్ల, కాలనాటికారంగములుగా బ్రత్యక్షమై, యాతనిని వివిధ వికారములకు లోనుజేయును.

పరమేశ్వరమూర్తికి ప్రాపంచిక మైన వ్యవహార పథము లపరిచితములు. ఆతని నావరించియున్న సహజపాండిత్యమే యాతనికి బరీక్షలలో జయము గొని తెచ్చి యాతనికే యాశ్చర్యము గొల్పుచుండును.

ప్రాణస్నేహితుడగు నారాయణరావువలె పరమేశ్వరమూర్తి గూడ సౌందర్యోపాసకుడు. అపశ్రుతియన్న యాతని హృదయము తటతట కొట్టుకొని విహ్వలించును. ఒక నా డాతడు స్నేహితుని ఇంటికి బోయి, చక్కగా నలంకరించియున్న యాతని గదిని చూచెను. తెల్లనిగోడల పైన నచ్చటచ్చట ప్రఖ్యాత భారతీయ చిత్ర కారుల ప్రసిద్ధ చిత్రాల ప్రతులు అలంకరింపబడియున్నవి. ద్వారములకు గవాక్షములకు ఖద్దరుపై మనోహరవర్ణములు చిత్రించిన మచిలీపట్టణపు, పంజాబు దేశపు కలంకారీ అద్దకపు దెరలు వ్రేలాడదీసియున్నవి. శోభాయమానమగు నా మందిరములో నొక యెడ దగిలించియుంచిన క్యాలెండరు