పుట:Narayana Rao Novel.djvu/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

256

నా రా య ణ రా వు

బూనినది. బొమ్మలు వేయుట పరమేశ్వరునికడ నేర్చుకొన్నది. పార్శీబాలిక బోలి, గుజరాతీ వనితవలె, మహారాష్ట్ర యువతివలె నలంకరించుకొనుట నేర్చుకున్నది.

అన్నగారితో దనకు పియానోవాద్యము నేర్పించమని యన్నది. అమెరికానుండి వచ్చు భర్తకు కొన్ని ఇంగ్లీషుపాటలు పాడి వినిపించినచో, నెంతయో యానంద మొనగూడునని సిగ్గున నామె యాలోచించుకొన్నది.


౧౪ ( 14 )

రామచంద్రుని విద్యార్థిదశ

హార్వర్డు విశ్వవిద్యాలయములో భారతీయ విద్యార్థు లొక వసతిగృహ మేర్పరచుకున్నారు. అందు రామచంద్రరావును జేరినాడు. అమెరికాలో నిరుపేద, హిందూదేశమున భాగ్యవంతుడు. భారతీయు లమెరికాలో జదువవలెనన్న మిక్కిలి భాగ్యవంతులు కావలెను. కాబట్టి భారతీయ విద్యార్థులు తమ దేశపు సన్యాసులవలె మితాహారమాత్రతృప్తులై అమెరికాలో జీవించుచుందురు. వారందరిలో రామచంద్రరావెక్కువ ధనము వెచ్చించుచుండెను.

అమెరికాలో భారతీయులను హీనముగ జూచువా రున్నారు. విచిత్ర జంతువులుగ జూచువారున్నారు. ఆధ్యాత్మికదృష్టి ప్రపంచమునకు నేర్పునట్టి శక్తిగల దివ్యదేశమునకు జెందిన యుత్తమపురుషులుగ జూచువారున్నారు.

రామచంద్రరావు సెలవుదినములలో నమెరికా దేశమంతయు జూచుటకు బోవువాడు. అచటి విహారవనములు, నదీపాతములు, లోయలు జూచివచ్చెను. పెక్కు కర్మాగారములు, పరిశ్రమ మహాప్రపంచములు సంచారమొనర్చెను.

ఎఫ్. ఏ. ఇంగ్లీషులో కృతార్థుడు గాకున్నను, లెక్కలలో ఆంధ్రవిశ్వవిద్యాలయమునందు ప్రథముడుగ గడతేరినాడు. అమెరికా వచ్చినవెనుక హార్వర్డు విశ్వవిద్యాలయమునందు లెక్కలలో నాతని మేధాసంపన్నతకు మెచ్చి ఇంగ్లీషు భాషాపరీక్షకు జదువవచ్చునని బ్రత్యేకముగ ననుమతి యొసంగిరి. ఇంగ్లీషుభాషలో నెగ్గుట కారునెలలు పట్టినది. రామచంద్రరావు ఈలోన బి. ఎస్ సి ఆనర్సులో జేరి చదువుటకు అధికారులు ప్రత్యేకానుమతి నొసంగిరి. లెక్కలలో, పదార్థవిజ్ఞానశాస్త్రములో నమెరికా విద్యార్థి ప్రపంచమున నాతనికి సమానులు డి. ఎస్‌సి. క్లాసులోకూడ లేరట.

రామచంద్రరావువచ్చి రెండేండ్లపై నాఱునెలలు అయినది. రెండేళ్లలో నా యువకుడు లెక్కలలోజూపిన తెలివితేటలు మిక్కుటము. అతనికి దెలిసిన కొన్ని లెక్కలవిజ్ఞానము ప్రపంచములో గొందరికిమాత్రమే తెలియును. ఈతడు జవాబుగోరి ప్రచురించిన గణిత ప్రశ్నలకు జవాబిచ్చువారు కనబడక