పుట:Narayana Rao Novel.djvu/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రమహారాజ్య చిహ్నములు

245

అడవులు, గోదావరీ నీలపులోతులు తన జీవితములోనికి ఆకర్షిస్తూ ప్రయాణము చెయ్యడము ఎంత ఆనందమో ఆలోచించండి.

‘అజంతాలోయలో జలజల ప్రవహించే భోగీరానది ఒడ్డున నిలుచుండి, ఆ జలప్రవాహము పాడు పాటలు వింటూ గోడల్లా పైకెగసిఉన్న ఆ కొండల మధ్య కనబడే ఆకాశము చూస్తూ అర్ధచంద్రాకృతిగా ఉన్న ఆ విచిత్ర కందరముల గమనిస్తూ, సంధ్యారుణకాంతులు ఆకాశాన ప్రసరిస్తూ కొండ శిఖరాన్ని ఎరుపుచేస్తూంటే, ఆ దివ్యప్రపంచంలో పురాతన శిల్పి చెక్కిన విగ్రహాలకుమల్లే అలా నిలుచుండిపోయాము.

‘వాతాపినగరములో పశ్చిమచాళుక్యుల శిల్పచమత్కృతి ఉన్నది. కన్హేరీగుహలు గ్రీకుల లేబ్రినులవలె ఉంటవి. కార్లేగుహలు అతి పురాతనమగు ఆంధ్ర బౌద్ధగుహలు. రెండువేల రెండువందల సంవత్సరాలక్రిత మా గుహలలో నిర్మించిన దారుఫలకములు నేటికినీ చెక్కు చెదరకుండా ఉన్నవి. నాసికలోని గుహలలో ఆంధ్రరాజుల శాసనములు చెక్కించినారు. ఔరంగాబాదు గుహలలోగూడ మంచి విగ్రహములు, చిత్రలేఖనము లున్నవి. నానాఘట్టములలో ఆంధ్రశాతవాహన ప్రభువుల శిల్పాలున్నవి.

‘బీజపురములో బోలుగుంబాజ్ అనేది ప్రపంచములోనున్న పెద్ద గుమ్మటములలో నొకటి. ఆ గుమ్మటములో పైకెక్కి గుమ్మటమున కావల నీవల నిద్దరు మనుష్యులుండి ఎంతకేక వేసినా వినపడదు. గుమ్మటము గోడపై పెదవి యొకరూ, చెవి యొకరూ ఆన్చి రహస్యములు, గుసగుసలు సల్పినచో గూడ స్పష్టముగా వినబడును.

‘దౌలతాబాదుతోట అజేయము. తినుబండారములు చేరనీయక మాడ్చవలసినదే గాని మానవమాత్రు డా దుర్గమును శౌర్యముచే చేరలేడు. ధాన్యపు రాశివలె అయిదువందల అడుగుల ఎత్తున ఉన్న కొండను, వరికుప్పవలె చెక్కినారు. కొండచుట్టూ సమతలానికి నూరడుగుల లోతు కందకం, నూరడుగుల వెడల్పు ఉంటుంది. సమతలానికి పైన గోడలా చెక్కిన కొండభాగం ఎత్తు నూటఏభై అడుగులు. కొండంతా కోటగోడలు. కొండశిఖరంపై చిన్నకోట, కోటమధ్య రాజభవనం, భవనం శిఖరంమీద ఫిరంగి.

‘త్ర్యంబకంలో గోదావరి పుట్టింది. కోట్లకొలది సంవత్సరాల యీడున్న ఆ కొండలు నాలుగువేలు, అయిదువేలు అడుగుల ఎత్తు, సగం ఎత్తువరకు కంకరా, అడవులూ ఆవరించిఉంటాయి. తక్కినభాగం అంతా నల్లటిరాయి. అల్లాంటి ఒక కొండ వెయ్యి, పదిహేనువందల అడుగులఎత్తు ఎక్కాము. ఆ పైన ఒక చిన్నగుహ, కోనేరున్ను. కోనేటి ప్రక్కను ఒక గోముఖవిగ్రహం ఉన్నది. ఆ గోముఖంలోంచి చుక్కచుక్కలా గోదావరినది పడుతోంది. అసలు అక్కడ అన్నీ కొండలలోంచి ప్రవహించే జలప్రవాహాలే. అవి అన్నీ గోదావరి అన్న పేరుతో ఉన్న చిన్నయేటిలో కలుస్తాయి. అక్కడినుంచి ఇరు