పుట:Narayana Rao Novel.djvu/245

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
244
నా రా య ణ రా వు

కాకతీయులు, రెడ్డులు, వెలమలు, క్షత్రియులు, తెలగాలు, కమ్మవారు, గొల్లలు, కోమట్లు, బ్రాహ్మణులు రాజ్యాలు చేశారు.

‘ఆంధ్రమహారాజ్యము యొక్క చిహ్నాలలో అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, గోలి, ఘంటశాల, నాగార్జునమెట్ట ముఖ్యమైనవి. ఆంధ్రశిల్ప మత్యంత ప్రాభవము పొందినది. అంత ఉత్తమశిల్పము నాటికి నేటికి లేదని వక్కాణింపవచ్చును. అంతయు పల్నాటి పాలరాతిలో చెక్కారు.

‘ఆంధ్రశిల్పంయొక్క గొప్పంతా చెన్నపురి, లండను, బెర్లిను వస్తు ప్రదర్శనశాలలలో ఉన్నది.

‘పల్లవులున్నూ తమయొక్క చిహ్నాలు కాంచీపురంలో, మహాబలిపురంలో అక్కడక్కడా నిలిపారు. విజయవాడలో వారు నిర్మించినట్టి దేవాలయం కృష్ణఒడ్డునే కొండమీద ఉన్నది.’

అతని ఉపన్యాసం వరదలనాటి గోదావరినదివలె ప్రవహించుచున్నది.

‘మహాబలిపురశిల్పంలోని గంభీరత అతి విచిత్రమైనది. అర్జునుని తపస్సు, కోతులగుంపు, యేనుగుల శిల్ప విన్యాసం మాధుర్యం వెదజల్లుచుండును. అచ్చట రాతిరథములు, ఒకేరాతిలో దొలిచినవి. ఆ గుడులు పరమాద్భుతములు. పంచపాండవుల రథములు, ద్రౌపదిరథము నున్నవి. ఆ పట్టణమంతయు సముద్రమున మునిగిపోవుచున్నది.

‘చాళుక్యుల శిల్పము, దేశమంతయు వెదజల్లబడియున్నది. బాదామిలో, కళ్యాణిలో, ద్రాక్షారామములో, రాణ్మహేంద్రవరములో, సింహాచలములో ఇంకా అనేక స్థలములలోనున్న దేవాలయములలో విగ్రహములలో చాళుక్యుల శిల్పచమత్కృతి కనబడుతుంది. చాళుక్య దేవాలయములు దాక్షిణాత్య దేవాలయములంత పెద్దవికావు.

‘కాకతీయుల శిల్పకళాప్రాభవము ఓరుగల్లులో, పాలంపేటలో, అమ్మకొండలో దర్శనమిస్తుంది. కాకతీయులు శ్రీనటేశ్వరుని నాట్యమహదానందము చూపించుకొన్నారు వారి శిల్పములో.

‘విజయనగర సామ్రాజ్యము హంపీ, తాడిపత్రి, పెనుగొండ, గుత్తి, మాచెర్ల, లేపాక్షులలో జూడగలము. హంపీదృశ్యములు జూచిన యేమానవుని గుండెలు తరుగుకొనిపోవు?

‘మన హృదయములు విశాలతనొంది సర్వమానవ ప్రేమవిలసితాలు కావలెనంటే కళాపూజకన్న ఇంకోటిలేదు. ఇంతమందిలో భద్రాచలము ఎంతమంది వెళ్లారు? భద్రాచలము వెళ్లుటే ఒక చక్కని యాత్ర. గోదావరిలో పడవలలో ఒక వారమురోజులు ప్రయాణము. ముందు ముందు మోటారు లాంచీలు వస్తాయి అనుకోండి. ఆ పాపికొండల్లో పడవమీద ప్రయాణం చేస్తూ తిప్పలమిద వండుకుంటూ, వెన్నెల్లో తిప్పలమీద పవళిస్తూ కొండలు,