పుట:Narayana Rao Novel.djvu/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

నా రా య ణ రా వు

ఉత్తమాట. ఇక భూమి అమ్మాలి. ఎవరైనా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించిన వాళ్లు కొనాలి. అల్లాంటి వాళ్ళు ఎప్పుడూ దొరుకుతారా? ఎక్కడ కావలిస్తే అక్కడ దొరుకుతారా? ఏమోయి వసంతయ్యా!’ అని సుబ్బారాయుడు గారు తన్ను బదులడుగుటకు వచ్చిన వసంతయ్య అను గోపాలపురం పెద్దకాపును పృచ్ఛచేసెను. వసంతయ్యకు నారువేలప్పు భూమితాకట్టుమీద కావలయునట.

‘స్వంత కమతం ఎప్పుడైనా లాభమిచ్చిందోయి? మాతండ్రి నాటి నుంచీ మేమూ స్వంతకమతం చేయిస్తూనే ఉన్నామా, పల్లంసాగుపై ఒక్క సంవత్సర మైనా లాభించింది కనబడదు. ఎంతపంటయినా ఈ పన్నులు మింగేస్తున్నాయయ్యా. అదీ కాకుండా ధనం దేశంలోంచి ప్రతినిమిషము పోతోంది. దానితోటి మనకొంపలు మునిగిపోతున్నాయి.’

‘అదేమిటండీ బావయ్య గారూ! ‘వాడికేం పచ్చగాఉన్నాడు’ అని మనం అనుకునే ప్రతివాడు లోపల లొఠారమే కదాండి.’

‘ఏమిటంటావు దానికి కారణం?’

‘అప్పులండి మరి.’

‘ఎందుకా అప్పు అయిందీ అంట?’

‘తమరిందాకటినుంచి అన్న కారణమేనండి బావయ్య గారూ. ఒళ్ళు తెలియకుండా అప్పులు చేశాము. నా చిన్నతనంలో వెండినగలేకాదండీ! ఎట్లా వచ్చిందండి బంగారం, అప్పులు చెయ్యకపోతే? యుద్ధం వచ్చినదగ్గర నుంచీ బంగారం కొనడం మొదలెట్టాము. మాకప్పులే, ఆడోళ్లకిమాత్రం ఒళ్ళంతా బంగారం.’

‘దానికేమిలే బంగారమైనా కనబడుతూంది. తక్కిన ఖర్చులమాట?’

‘అవును బావయ్య గారు! కుఱ్ఱాళ్ళకి చదువుఖర్చులు, మావోళ్ళిద్దరూ రాజమండ్రిలో కాలేజీలో ఓడు, పెద్దస్కూల్లో ఓడు. వాళ్ళు డబ్బు మింగేస్తున్నారండీ బావయ్య గారూ.’

‘చదువు చెప్పించడం తప్పననుగాని, మనం చదువులికి కుఱ్ఱాళ్ళను ఎందుకు పంపిస్తున్నాము? యుద్ధము రాక పూర్వం దేశంలో పైచదువులు చదువుకున్న వాళ్లు తక్కువ. చదువుకున్నవాళ్లు నలుగురే. వాళ్లందరికీ తలాఒక ఉద్యోగం అయింది. వాళ్ళు కాస్త పచ్చగావుండడం, నెలకి తప్పకుండా నాలుగురాళ్లు వస్తూవుండడం. మన రైతులదగ్గిర ధాన్యంరోజులలోనేగా నాలుగు రాళ్లు కనబడడం?’

‘చిత్తం.’

‘కాబట్టి మనవాళ్ళేంజేశారు? ఉద్యోగాలు మన్ని పోషించాలికాని భూములు కాదనుకున్నారు. ఇక అసలే లేవలేనమ్మ అట కెక్కుతానందని, చదువుల్లో తగలడి చక్కాపోయ్యాము. మనదేశంలో చదువంత ఖరీదుగల వస్తు