పుట:NagaraSarwaswam.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82


స్ఫుటంగా వ్యక్తం అవుతుంది. ఆలుమగలు తమ సంతానానికి ఎదుటనే విచ్చలవిడిగా సంచరించేచోట్ల యీగుణము యౌవనముయొక్క రాకకు పూర్వమే వారిమనస్సులో రూపొంది వారి స్వభావానికి వర్తనానికి చేటు తెస్తుంది. అందుచే ఆలుమగలు తమసంతానమునకు మూడేండ్లు వచ్చినదిమొదలు వారియెదుట విచ్చలవిడిగా శృంగార భావభావితులై చరింపరాదు.

కామము అనే యీగుణముయొక్క దైవభావనయే మన్మధుడు. ఈమన్మధుడు లేక కామముయొక్క శరీరములోపదిరకాలు అవస్థలు యేర్పడతాయి. వానికే మన్మధావస్థలనిపేరు. అవిక్రమంగా వివరింపబడుతున్నాయి. యీ అవస్థలన్నిటియందు పూర్వావస్థ దుర్బలంగా వుంటే తరువాతి అవస్థ జనింపదు.

1 అభిలాష :- వయస్సులోవున్న సుందరివంక పురుషుడు, లేదా సుందరమైన పురుషునివంక యువతి కోరికతో చూడడం జరిగితే ఆ అవస్థకు అభిలాష అనిపేరు. ఇక్కడ కామము లేక మదనుడు మొదటి మెట్టుమీద వున్నట్లులెక్క.

2 చింత :- స్త్రీ పురుషులు తమకంటికి మనస్సుకు నచ్చిన స్త్రీమూర్తులను ఎందరినో చూస్తూ ఉంటారు. కాని వారు తత్కాలంలో కొంత అభిలాష కలవారైనప్పటికి తరువాత ఆ సుందరులనే తలచుకొంటూ కూర్చుండరు. మరచిపోతారు అలా మరచిపోవుట జరిగితే "అభిలాష" అనే అవస్థ దుర్బలమైనదని గ్రహించాలి. కాని కొన్నిచోట్ల అలాకాక తాము సాభిలాషగా చూచిన సుందరాకారం వారిమనస్సులో నిలచిపోయి వారికి మాటి మాటికి గుర్తువస్తుంది అలా గుర్తువచ్చినప్పుడు వారియందలి కోరిక కొంతబలాన్ని పొంది రెపరెపలాడుతుంది. ఇదిగో! కామముయొక్క ఈస్థితి 'చింత' అనబడుతుంది.

3 అనుస్మరణము :- ఏదో ఒకటి రెండుసార్లు గుర్తువచ్చి కోరిక కొంతబలాన్ని పుంజుకొన్నప్పటికి సాధారణంగా అది అంతటితో