పుట:NagaraSarwaswam.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63

8. విక్షేపము : పతిని గాంచిన సంతోషములో ఏదో ఆవేశమునకు లోనై స్థిరతను వీడి వివిధవికారములను ప్రదర్శించుట "విక్షేపము"-అని కొందరి మతము.

మరికొందరు యువతి నగలు సగము సగముగా ధరించి, జడ పూర్తిగా కాక సగమే వేసికొని, ఊరకే క్రీగంట చూస్తూ పతితో గుసగుసలాడడం విక్షేపమన్నారు.

"ఓయి మిత్రుడా! నీయొద్ద దాపరిక మేమున్నది. నిన్న నేను నాప్రియతమ సన్నిధికి వెళ్ళేను. అప్పుడామె తల్లిదండ్రులను, బంధుజనమును తప్పించుకొని నాయొద్దకు వచ్చినది. ఆసమయంలో ఆమె రూపము పరమ మనోహరంగా ఉన్నది. జడసరిగా అల్లుకొనలేదు. కాటుక సరిగా పెట్టుకొనలేదు. నుదుట కుంకుమతిలకము చక్కగా దిద్దుకొన లేదు. నడుమునకు ఉన్న ఒడ్డాణములోని మువ్వలు చక్కగా ధ్వనిస్తున్నాయి. మెడలోని హారాలు బుజంమీదకు జారిఉన్నాయి. ఇట్టి రూపముతో ఆమె నాయొద్ద కూర్చుండి ఏవో మాటలు లజ్జానమ్రమూడియై మధురంగా పలికింది. ఇట్టిదైన ప్రియారూపం నామానసంలో హత్తుకొని పోయింది."

యువతీ గతమైన ఇట్టి చేష్ట విక్షేపము అనబడుతుంది. సాధారణముగా ఈ విక్షేపమన్న చేష్ట నవదంపతులయందు గోచరిస్తుంది. వివాహము జరిగిన కొలది కాలానికే వరుడు అత్తవారి యింటికి ఏపండుగకో వెళ్ళినపుడు-భర్తతో కొంత పరిచయం ఏర్పడి ఏర్పడనిస్థితిలో ముద్దురాలైన వధువు ఈ విక్షేపాన్ని అనుకొనకుండ (తలవని తలంపుగ) ప్రదర్శిస్తుంది. ఈవిక్షేపాన్ని వివాహితులైన దంపతులందరును అనుభవించియే ఉంటారు. ఏదో తెలియని ఆనందాన్ని అందొకొంటున్నామనియే తప్ప, ఆఆనందం ప్రియురాలు ఆచరించే విక్షేపమనే చేష్టవల్ల లభిస్తోందని పురుషునకు, ఇట్టి చేష్ట నాచే ఆచరింపబడి భర్తయొక్క మానసంలో ఆనందతరంగాలను సృష్టిస్తూ ఉన్నదని వథువుకు తెలియ