పుట:NagaraSarwaswam.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64


కుండగనే ఈ విక్షేపం ఏర్పడుతుంది. అందువల్లనే "కామో నాఖ్యాత శిక్షితః"-గురువులయొద్ద చదువకపోయినా కామం తెలియబడుతుందన్నారు.

9. వికృతము :- పతితో మాటాడునపుడు వనిత అతని మాటలకు కావలెనని వంకర సమాధానములు చెప్పుట 'వికృతము' అనే శృంగారచేష్టగా పేర్కొనబడ్డది. అనురక్తులైన భార్యాభర్తలయొక్క చేష్టలు ఎట్టివైనా పరస్పరం ఆనందాన్నే కలిగిస్తాయి. భర్త యేదో అంటే భార్య ఆశబ్ధాన్ని కొంత పెడగా విరచి వక్రంగా సమాధానం చెప్పడం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అయిత ఈ వక్రత భార్యాగతమైనది కావడంవల్ల పురుషుని మానసంలో ని శృంగారభావాన్ని తరంగితం చేస్తుంది.

"ఆలుమగలు పరస్పరం దగ్గరగా కూర్చుండి ఉన్నారు. ఆమె మెడలో హారాలు, కాళ్ళకు అందెలు ధరించి ఉన్నది. ఆ సమయంలో ప్రియుడు ఊరకనే-నీమెడలోని నగ పేరేమిటి? అన్నాడు.ఆమె కేవలం నవ్వులాటకై నామెడలోనిది హారం అనడానికి బదులుగా-మెడలోని నగ 'నూపురం' అంటె "అందె" అన్నది. అయితే నీకాలికున్న నగ పేరేమిటి? అన్నాడు భర్త. ఆమె కూడ తడుముకోకుండా-అదా, అది కంకణం, అన్నది తన సమాధానాని తానే నవ్వుకొంటూ.

ప్రియురాలి యీసమాధానానికి నవ్వుతూ ప్రియుడామె బుగ్గపై సన్నగా గిల్లేడు. ఆమె బుగ్గను చేతితో రాసుకొంటూ ఏమిటిది? అన్నది. వెంటనే ప్రియుడు-ఇదా, ఇది చుంబనం, అంటే ముద్దు-అన్నాడు. నవ్వుతూ-ఆమె నవ్వింది, అతడామెను కౌగలించుకొన్నాడు.

ఇదుగో! ఇట్టి చేష్టకీ వికృతమని పేరు.

10 మదము:- కొంతమంది స్త్రీల శరీరంలో యౌవనం సన్నసన్నగా ప్రవేశిస్తుంది. అధికంగా విజృంభించదు. కొంతమంది స్త్రీల