పుట:NagaraSarwaswam.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62


లోకంలో 'ఒయ్యారం' అంటారు. ఇట్టి మారిన చేష్టకే 'విలాసము' అనిపేరు.

"చెలీ నీ ముఖంమీద యీ వింత కాంతియేమిటే! నా ప్రశ్న విని నవ్వుతావు దేనికి! నీ నడక చాల ఒయ్యారంగా ఉన్నదే! ఈ ఒయ్యారపు నడక ఎక్కడనేర్చావు! పడగలవు మాటాడవేమిటి! పలుకే బంగారమైనదా యేమిటి! అసలు నామాటలు నీకు వినబడుతున్నాయ్యా! ఎందుకే అక్కడే నిలువబడిపోయావు? నీలో ఏదో మార్పు వచ్చింది. నీపతి వచ్చినాడేమిటి? ఆయనరాక నీలో ఆనందజ్యోతి వెలిగించి వుంటుంది. అందుకే యీ మార్పులన్నీవచ్చాయి- ఇత్యాదిగా విలాసాన్ని ప్రదర్శించే యువతులనుగూర్చి వారిచెలికత్తెలు పలుకుతూంటారు.

పదునారేండ్ల వయసులోని కన్యకు పెండ్లిచేసి 'శోభనం' ఇంకా చెయ్యక ఏ పండుగకో ఆమె భర్తను ఆహ్వానించి తీసికొనివస్తే, పతి యింటికి వచ్చిన సమయంలో ఆమె ఒక్కసారిగా మారిపోతుంది. అట్టివారి యందే విలాస లక్షణాన్ని స్ఫుటంగా గుర్తించవచ్చును.

7 హావము : కన్నులయొక్క కనుబొమ్మలయొక్క కదలికలోని మార్పు కారణముగాను, మాటలోని మాధుర్యం కారణంగాను, సంభోగేచ్ఛ కొంచముగా వ్యక్తం అయితే ఆచేష్ట "హావం" అనబడుతుంది.

"పెండ్లి కొడుకును చూచేవు కదా! మా కందరికీ నచ్చేడు. పున్నమి చంద్రుడులా ఉన్నాడు. మెరుస్తూ ఉన్న పెద్ద కళ్ళు-ఉంగరాలు తిరిగిన నల్లని జుట్టు-పల్చగా, పచ్చగా పొడవుగా నాజూకుగా ఉన్నాడు. ఇంతకూ నీకు నచ్చినాడాలేదా? అలా చూస్తావేమిటే! చెప్పు!" అని పెద్దలడిగితే పదునారేండ్ల కన్యక.

కొంచెంగా నవ్వుతూ-మెరసే కండ్లతో క్రింది చూపులు చూస్తూ, కనుబొమలుకదలిస్తూ "నాకేం తెలుస్తుంది, మీయిష్టం!" అన్నమాటలు మధురంగా పలుకుతుంది. ఇదిగో! ఇట్టి చేష్టకే "హాసం"