పుట:NagaraSarwaswam.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

కాషాయరంగు దారముతో గ్రుచ్చబడిన పుష్పమాల 'విరక్తికి' సంకేతమైయున్నది. అట్టిమాల తనకు పంపబడినపుడు లేక దానిని ధరించి తన నెచ్చెలి తనయెదుట సంచరించినపుడు-దానిని పంపిన లేక ధరించిన నెచ్చెలి తనయందు విరక్తి చెందినటులు గ్రహించాలి.

ఈ సర్వవిధములైన సంకేతములు యువతీయువకుల ఆనంద స్రోతస్సులకు ఏతా మెత్తజాలినవి. ఈ సంకేతాలన్నీ ఆలుమగలలో లేక కామినీకాముకులలో ఒక్కరికిమాత్రమే తెలిసివున్నప్పుడు వీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదుకదా! అని వీనియందు నిరాదరం చూపడంకంటె వీనినితెలిసికొని పరస్పరం ప్రాణాధికంగా ప్రేమించుకొనే ఆలుమగలు వినియోగించడంజరిగితే వారనుభవించే ఆనందం యినుమడిస్తుంది.

వనితలు యీ సంకేతాలు తమకు తెలియనపుడు పతిద్వారా తెలిసికొని వినియోగిస్తే మంచిదే. కాని భర్త యీ సంకేతాలను విడదీసి చెప్పగల నిలుకడ లేనివాడైనపుడు, వారు స్వయంగా కామశాస్త్రాలను చదువనివారైనపుడు ఇవి వారికి తెలిసే అవకాశంవుండదు. అప్పుడు వారు తాము అనుభవించగల అధికానందము అనుభవించలేని వారవుతారేకాని వేరే యేదో విపత్తుకు లోనుకావడం జరుగదు.

కాని పురుషుల విషయం అట్టిదికాదు. వారు యీ సర్వసంకేతాలను ప్రయత్నించి తెలిసికొని యుండాలి. ఏమంటే, అన్నిచోటులందు కాకపోయినా, ఎక్కడనో ఎవ్వరికో అదృష్టవంతునకు సకల కళా నిపుణయై, కామశాస్త్ర సంకేతాలను సద్యస్స్ఫూర్తితో వినియోగించే నేర్పుకల పడతి భార్యగా లభించవచ్చును. అపుడామె యీ సంకేతాలను వినియోగించడం జరిగితే-వీని అర్ధాలను గ్రహింపజాలని భర్త సముచితముగా వ్యవహరింపజాలని మూఢుడు అవుతాడు. అపుడావనిత వానియందు విరక్తి చెందుతుంది. అందుచే పురుషుడు యీ సంకేతార్ధాలను గ్రహించడం చాలాఅవసరం. తన భార్యకుకూడ అతడి సంకేతాలను వివరంగా విశదీకరిస్తే పరస్పరం ఆనందించే అవకాశం ఉంటుంది.