పుట:NagaraSarwaswam.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

53

"కామీ స్వతాం పశ్యతి" అన్నారు. కాముకుడు తన మనస్సులోని భావానికి అనుకూలముగా ఊహిస్తారు. తాను ప్రేమించిన ఒక యువతి (ఆమె తన్ను ఎందుకో నవ్వితే, తన్ను చూచియే నవ్వుచున్నదనుకొనుట, పైట సరిచేసుకొంటే తన్నుచూచి సాభిప్రాయముగా ఆలా చేసినదనుకొనుట కాముకులకు సహజం. కేవలం ఇలామనస్సులో ఊహించుకొని గాలి మేడలు కట్టుకొంటూ కూర్చుంటే కలిగే బాధ ఏమీ వుండదుకాని, యదార్ధం తెలియకుండ ముందుమాటవేస్తే ప్రమాదం తప్పదు.

అలాగే ఈ సంకేత విషయాలలోకూడ—ఒక యువతి ఎందుకో తలమీద చేయి వేసుకొంటే, ఆమె తన్ను ఆరాధిస్తున్నానని అంగీక సంకేతంద్వారా తెలియజేస్తున్నదని, గుండెపై చేయి వేసుకొంటే 'నేను నిన్ను ప్రేమిస్తున్నానని సూచిస్తూ ఉన్నదని'-యీ మొదలుగా భావించడం, భావించి ముందడగు వేయడం ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. బాగా నిదానించి, ఆమె యీ సంకేతం ఎఱిగి వుండి చేస్తున్నదా లేక తలవని తలంపుగా అలా జరిగినదా, అన్న విషయం గమనించి రూఢిచేసుకొనికాని ముందడుగు వేయకూడదు. పూర్వ పరిచితులైన యువతీయువకులైతే అలా సంకోచింప నక్కరలేదు.

యువతి చేసిన సంకేతాన్ని సరిగా తెలిసికొనక తప్పుగా తెలిసికొని వ్యవహరించడం మరీ ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది. కామశాస్త్ర సంకేతములన్నియు తెలిసికొన్నిటైన ఒక యువతి తనవలెనే విజ్ఞుడైన తన ప్రేమికునకు—"తూరుపు దెసగా రమ్మని చూపుడు వ్రేలిని ప్రదర్శిస్తే" ఆ యువకుడు ఆ సంకేతాన్ని తప్పుగా అర్ధంచేసికొని 'పడమరగా' ఆ యింట ప్రవేశిస్తే ప్రమాదం కలుగదా?

రత్న కుమారుడనే వాడు వెనుక ఈ విధంగానే ఒకనాగర యువతి చేసిన సంకేతాన్ని తప్పుగా అర్ధంచేసుకొని వ్యవహరించినవాడై పరాభవింపబడ్డాడని ప్రాచీన కామశాస్త్రలలో ప్రాసంగికంగా చెప్పబడ్డది.