పుట:NagaraSarwaswam.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

ఎవరైనా ఒకయువతి ప్రియవిరహంతో మ్రగ్గిపోతూ ఎట్టకేలకు కంటబడిన ప్రియునితో—"నేను కామాతురనై ఉన్నాను".—అని చెప్పదలచినపుడు కచదంశం (జుట్టు లేక జడను వెనుకనుండి ముందుకు తెచ్చి మునిపంటితో కొరకడం) సంకేతముగా చెప్పబడ్డది.

భార్య, పరిచిత, లేక అపరిచిత అయిన యువతి తన్ను సాభిలాషంగా చూస్తూ 'కచదంశం' ఆచరిస్తే-ఆమె కామాతురయై ఉన్నదని తన్నుకోరుతూన్నదని పురుషుడు గ్రహించాలి.

"గుండెమీద చేయివేసి ప్రదర్శించడం"-"నాకు నీమీద మిక్కిలి ప్రేమఉన్నది"—అనడానికి సంకేతముగా చెప్పబడ్డది. ఎవరైనా మదవతియైన యువతి తన గుండెమీద చేయి చేర్చుకొన్నదై సాభిలాషంగాచూస్తే—పురుషుడామె తన ప్రేమను వెల్లడిస్తూన్నదని గ్రహించాలి.

"నేను నిన్ను ఆరాధిస్తున్నాను"—అని సూచించడానికి-తలమీద చేయిచేర్చి ప్రదర్శించడం—సంకేతముగా చెప్పబడ్డది.

ప్రియురాలు చేతిని తలపై చేర్చినదై సాభిలాషగాచూస్తే—పురుషుడామె తన్ను ఆరాధిస్తూన్నదని గ్రహించాలి.

ఇలా ఆమె తన్నుకోరుతూ ఆరాధిస్తూన్నదని తనకు తెలిసినా, ఆమెను కలియడానికి అది తగిన సమయం అగునో కాదో తెలిసికొనకుండా ముందడుగువేస్తే పురుషునకు పరాభవం తప్పదు.

అందుచే "ఇది తగిన సమయం అవునా కాదా? అని ప్రశ్నించడానికి వేరేసంకేతము చెప్పబడ్డది. అట్టి ప్రశ్నకు-చాపిన చూపుడు వ్రేలిమీద నడుమవ్రేలిని ఎక్కించి ప్రదర్శించడం—సంకేతముగా చెప్పబడినది.

ప్రియుడు తనవంకకుచూస్తూ—చూపుడువ్రేలిని చాచి దాని మీదకు నడుమవ్రేలిని ఎక్కించి ప్రదర్శిస్తే—ఇది తగిన సమయం అగునా కాదా? అని ప్రశ్నిస్తున్నాడని యువతి గ్రహించాలి.