పుట:NagaraSarwaswam.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

157


దేవతను ఆరాధించాలి.[1] ఆమెయొక్క భర్తకూడ పరస్త్రీగమనము అసత్యము, మద్యము, మాంసము, పరిహాసము, క్రోధము, అభిమానము - అనే దోషాలను విడచి శివపూజా పరుడుకావాలి. తనకు సంతానమును అనుగ్రహింపుమని పార్వతీతోకూడిన పరమశివుని ప్రార్ధించాలి.

ఈవిధంగా పవిత్రముగా పగటిభాగము గడపి సూర్యుడస్తమించి చీకటి పడినమీదట చక్కగా అలంకరింపబడిన శయ్యాగృహానికి చేరుకొని ఆదంపతులు ఇష్టదైవాన్ని స్మరించి బాహ్య-అభ్యంతర రతులయందు ప్రవృత్తులు కావాలి. ఈవిధంగా రతిలో ప్రవృత్తులుకావడానికి పూర్వం వారు తమయొక్క శ్వాస సూర్యనాడిలో నున్నదో చంద్రనాడిలో ఉన్నదో గమనించి చంద్రనాడిలో ఉంటే సూర్యనాడిలోనికి మార్చుకోవాలి అయితే సూర్యనాడి చంద్రనాడి అనగా ఏమోకొందరకు తెలియకపోవచ్చును. అందుచే ఆనాడుల విషయం ఇచ్చట తెలుపబడుతూ ఉన్నది.

సూర్యచంద్రనాడులు : మానవుడు ముక్కుతో శ్వాసక్రియ జరుపుతాడుకదా! ఆముక్కుకు ఉన్న రంధ్రాలు రెండు. ఈ రెండింటి ద్వారా గాలి పీల్చి వదలుతున్నామని అందరూ అనుకొంటారు! కాని దీనిలో కొంత తేడా ఉన్నది. ముక్కుయొక్క రెండురంధ్రాల ద్వారా కాక యేదో ఒక రంధ్రంద్వారా మాత్రమే శ్వాసక్రియ జరుగుతూ వుంటుంది. కొంతసేపు కుడిరంధ్రముద్వారా శ్వాసక్రియ జరిగితే కొంతసేపు ఎడమరంధ్రము ద్వారా జరుగుతుంది. ఒక రంధ్రము నుండి వేరొక రంధ్రానికి శ్వాసమార్పుచెందే సమయంలో మాత్రం కొన్ని క్షణాలు రెండు రంధ్రాలతోను శ్వాసక్రియ సాగుతుంది. ఈ మార్పులు మనకు తెలియకుండానే జరుగుతూ వుంటాయి.

వీనిలో కుడిరంధ్రము నుండి జరిగే శ్వాసక్రియ సూర్యనాడి అని ఎడమరంధ్రము నుండి జరిగే శ్వాసక్రియ చంద్రనాడి అని అన

  1. ఈ గ్రంథకర్త బౌద్ధుడైనందున సంతానాభిలాషకల బౌద్ధవనిత బౌద్ధబిక్షువులకు భోజనం పెట్టాలి అని, బౌద్ధులకు ఆరాధ్యదేవతయైన "తారాదేవిని' పూజించాలి" అని కూడ చెప్పినాడు.