పుట:NagaraSarwaswam.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158


బడతాయి. చంద్రనాడిని సూర్యనాడిగా మార్చదలచినపుడు ముక్కు యొక్క ఎడమరంధ్రమును చేతితో మూసి కుడిరంధ్రముద్వారా బలంగా శ్వాసపీల్చి విడిచిపెట్టాలి. ఇలా కొన్నిసార్లుచేయగా శ్వాస సహజంగానే కుడిరంధ్రంలో రాకపోకలు సాగిస్తుంది. సూర్యనాడి చంద్రనాడిగా మార్చవలెనన్నపుడుకూడ ఇదేవిధానం. అప్పుడు కుడి రంధ్రమును వ్రేలితోమూసి ఎడమరంధ్రముద్వారా బలంగా గాలిపీల్చి విడువాలి. సూర్యనాడియందు శరీరములోని నెత్తురు మొదలగు సప్త ధాతువులయొక్క స్థితి స్చచ్ఛంగా ఉంటుంది. చంద్రనాడియందది కొంత మారుతుంది. ఇది నాడులను గూర్చిన అల్పపరిచయము. ప్రకృతానికి వద్దాము.

శయ్యాగృహానికి చేరుకొన్న దంపతులు తమ శ్వాసక్రియను సరిచేసుకొని తమయందు సూర్యనాడి ఆడుతూఉండగా, అనగా ముక్కుయొక్క కుడిరంధ్రములో నుండి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు జరుగుతూ ఉండగా బాహ్య-ఆభ్యంతర రతులయందు ప్రవృత్తులు కావాలి. ఆభ్యంతరరతి సమయములో భర్త తన పురుషాంగముచే భార్యయోనిలోని పుత్రనాడిని (ఈ విషయము వెనుక చెప్పబడినది) ప్రేరేపించినచో ఆమె గర్భాన్ని ధరించి వంశోద్ధారకుడైన కుమారుని ప్రసవిస్తుంది. ఆమె భర్త దుహిత్రిణీనాడిని ప్రేరేపించినచో ఆమె గుణవతియైన పుత్రికను ప్రసవిస్తుంది.

ఋతుస్నాన దివసంలో పైనచెప్పిన నియమాలను పాటించిన దంపతులకు అభీష్టసంతానం కలుగుతుంది. ఇందు సందేహం లేదు.

★ ★ ★