పుట:NagaraSarwaswam.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుత్రప్రాప్తి - ఉపాయము

దంపతులు ఈలోకంలో సుఖంగా ఆనందమయంగా తమ జీవనాలను గడపడానికి ఉపయోగించే సర్వవిషయాలు వెనుకటి ప్రకరణాలలో చెప్పబడ్డాయి. ఇక యీలోకంలోను పరలోకంలోను కూడ సుఖాన్ని అందిచ్చే పుత్రుడనే మహాఫలం దంపతులు ఏవిధంగా పొందగలరన్న విషయం ఈ ప్రకరణంలో చెప్పబడుతూ ఉన్నది.

సాధారణంగా ఆలుమగలు తమ కామపరితృప్తికై ప్రవర్తించే సమయములోనే భగవంతుని అనుగ్రహం వారియందు ఫలించి వారికి పుత్రుడో పుత్రికయో జన్మిస్తూ ఉంటారు. కాని కొందరికి పిల్లలు కలుగరు. అట్టివారు సంతానం కోసం పరితపిస్తూ చెట్టుకు, పుట్టకు మ్రొక్కుతూ, వ్రతాలు నియమాలు ఆచరిస్తూ ఉంటారు. అట్టిదంపతులు తమకు పుత్రులు కలుగలేదని చింతింపనక్కరలేదు. వారు ఈదిగువ విషయాలను పాటించడం ద్వారా సంతానాన్ని పొందగలుగుతారు.

పుత్రాభిలాషకల దంపతులు చేయవలసిన పనులు :

సంతానంకావాలని పరితపించే వనిత ఋతుస్నానం చేసిన రోజున పగలు చాల పవిత్రంగా గడపాలి. ఆరోజున ఆమె బ్రాహ్మణులకు భోజనంపెట్టి యధాశక్తి దక్షిణలిచ్చి, తనకు మంచి సంతతి కలుగునట్లు ఆశీర్వదించవలసినదిగా వారిని కోరాలి. స్వయంగా ఇష్ట