పుట:NagaraSarwaswam.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106


అచ్చట పురుషుడు తన పురుషాంగముతోడను లేదా తన చేతి వ్రేలితోడను కలచవచ్చును. ఇట్లు కలచుట వలన స్త్రీ యోనియందలి నాడీ సముదాయ మంతయు వింతగా కదిలి ఆమెలో పారవశ్యము యేర్పడుతుంది.

అభ్యంతర రతివేళ స్త్రీయొక్క సర్వశరీరము పురుషునిచే ఆక్రమింపబడుతుంది, స్త్రీయొక్క తృప్తికి హేతువైలైన నాడులు యోనియందేకాక శరీరమునందంతటను ఉన్నాయి. పురుషుడు వనితయందు రతికి వలసిన ఉత్కంఠను పెంపొందించి ఆమెలో పారవశ్యమును జనింపజేయుటకు కేవలము మదనచ్ఛత్రమునే కాక ఇతరనాడులనుకూడ కలచవలసివుంటుంది. అయితే ఆనాడులు స్థానాలు తెలియవలెనుకదా !

స్త్రీయొక్క రెండునేత్రములందు రెండునాడులున్నాయి. ముఖమందు (నుదుట) రెండునాడులున్నాయి. నోటియందొకనాడి ఉన్నది. కాలి బొటనవ్రేలి మొదటిభాగము నందొకనాడి ఉన్నవి.

పురుషుడు మదనచ్ఛత్రమును కలచువేళ ఈ నాడీ స్థానములయందు చుంబనాదులచే కదలిక కలిగించుట అవసరము. వనిత కాలిబొటనవ్రేలి మొదటనున్న నాడీస్థానమును పురుషుడు తనకాలి బొటనవ్రేలితో నొక్కుటవలన ఆనాడియందొక వింత కదలిక ఉదయిస్తుంది.

కొందరు రతిశాస్త్ర కోవిదులు ఈనాడులనేకాక వనితయొక్క తొడలను, చెవులను, ప్రక్కలను (పార్శ్వము) త్రికమును (వెన్నెముక తుదిభాగము) శిరస్సునుకూడ పురుషుడు తనచేతితో తాకుట అవసరమనియు, అట్లు తాకినగాని వనియలయందు అచ్చమైన పారవశ్యము ఉదయించదనియు చెప్పుచున్నారు.