పుట:NagaraSarwaswam.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోని స్వరూపము - నాడీభేదములు

స్త్రీయొక్క మహ్యావయవమునకే యోని అనిపేరు. "యౌతి శిశ్నేన ఇతి యోనిః" అనగా "శిశ్నముతో (పురుషాంగముతో) కూడుకొనునది" అని యోని శబ్దమునకు ఉత్పత్తి. కామభావము ఇక్కడ ఫలించుచుండుటచే దీనికి మదనమందిరము, మన్మధ గృహము మొదలగు పేర్గుకూడ యేర్పడ్డాయి.

స్త్రీయొక్క మదన మందిర ముఖద్వారమునందు ఒక సన్నని మెత్తని చర్మఖండము యేర్పడి ఉంటుంది. దీనికి మదనచ్ఛత్రము అని పేరు. ఛత్రము అనగా గొడుగు. మన్మధగృహద్వారమును కప్పియుంచునదగుటచే దీనికి మదనచ్ఛత్రము అను పేరేర్పడెను.

ఉ మదనచ్ఛత్రమునందు స్త్రీయొక్క శరీరములో కామభావమును జ్వలింపజేసే ఇరువది నాలుగు నాడులు సంగమిస్తున్నాయి. ఇన్ని మదనాడులకు కూడలియై యున్నదగుటచే ఈమదనచ్ఛత్రము ఆభ్యంతరరతి యందు స్త్రీయొక్క తృప్తిలో ప్రధానస్థానం ఆక్రమిస్తుంది.

ఆభ్యంతర రతిని ఉపక్రమిస్తూ పురుషుడు మొదట ఈ మదనచ్ఛత్రాన్ని తన చేతి వ్రేలితో కలచాలి. బాలను పదునారేండ్ల లోపువయసు కలది కలియునపుడే మదనచ్ఛత్రమును చేతివ్రేలి తోడనే కలచవలసి ఉంటుంది. కాని ప్రౌఢ అయిన వనితా విషయమున చేతి వ్రేలినే ఉపయోగించవలెనన్న నియమం లేదు.