పుట:NagaraSarwaswam.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

107

స్త్రీయొక్క యోనియందు ప్రధానములైన నాడులు ఆరు వున్నాయి. 1. సతీనాడి, 2. అసతీనాడి, 3. సుభగానాడి, 4. దుర్భగానాడి, 5. పుత్రీనాడి, 6. దుహిత్రిణీనాడి. అని వానిపేర్లు.

ఇందు సతీ - అసతీనాడులు స్త్రీయొక్క యోని పై చర్మమునందే ఉన్నాయి. సతీనాడి యోనికి ఎడమభాగమున అసతీనాడి కుడిభాగమున ఉంటాయి. "సుభగ, దుర్భగ " అనేనాడులు యోనియొక్క కొంత లోపలిభాగములో ఉన్నాయి. సుభగానాడి యోనిలో కుడివైపునవుంటుంది. ఇక పుత్రీ దుహిత్రిణీనాడులు యోనియొక్క మిక్కిలి లోపలిభాగంలో ఉంటాయి. పుత్రీనాడి యోనియొక్క మిక్కిలి లోపలిభాగంలో ఎడమవైపునవుంటే దుహిత్రీనాడి దానికి ఎదురుగా కుడివైపునవుంటుంది.

పురుషుడు తన పురుషాంగముతో ఈ నాడీస్థానములందు గాఢమైన స్పర్శ కలిగించాలి. సతీ అనే నాడీస్థానమునందు పురుషాంగ స్పర్శచే కులస్త్రీలు ఆనందిస్తారు. అసతీ అనేపేరుతో యోని యొక్క పైచర్మమున కుడిభాగమునందుండే నాడిని స్పృశించుట వలన వేశ్యలు, వ్యభిచారిణులు ఆనందిస్తారు. ఇది వ్యత్యస్తమైనపుడు అనగా కులస్త్రీయొక్క అసతీనాడికి, కులటయొక్క సతీనాడికి పురుషాంగముద్వారా ప్రేరణ కలిగినపుడు వారిలో రతికి సంబంధించిన ఉత్సాహము దీప్తము కాకపోవుటయేకాక వారాపురుషునియందు ద్వేషముకూడ వహిస్తారు.

స్త్రీ యోనియొక్క కొంత లోపలిభాగమునందు (ఎడమ - కుడిభాగములందు ఉండే సుభగా దుర్భగా నాడులలో పురుషుడు తనయొక్క అంగముచే సుభగానాడియందు మాత్రమే గాఢస్పర్శ కలిగించేవాడైనపుడు స్త్రీ మిక్కిలి తృప్తిని అనుభవించుటయే కాక, కాలంగడచే కొలది ఆమెశరీరం నునుపుదేరుతుంది. ఆమెశరీరంలో లావణ్యస్థానం ఏర్పరచుకొంటుంది, ఆమెయొక్క స్తనద్వంద్వం