పుట:NagaraSarwaswam.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104


పండ్లను మీదిపండ్లను అన్నిటిని వినియోగించి కొంచెము గాఢముగ క్షతమొనర్చినచో ఆపంటిగాట్లు వరుసగా యేర్పడతాయి. అవి ఎఱ్ఱగా మణులమాలవలె మెరుస్తాయి. అట్టి దంతక్షతమునకు మణిమాల అని పేరు.

6. గండకము : దీనికే ఖండకము లేక ఖండాభ్రకము అని పేరు. ఖండకము అనగా ముక్క. అభ్రము అనగా మేఘము. ఖండాభ్రకమునకు మేఘఖండమని అర్థము. ఆకాశమునందప్పుడప్పుడు దొంతులు దొంతులుగా ఒకేదానిమీద ఒకటి పేర్చినట్లు మేఘఖండాలు కనిపిస్తాయి. సరిగా అట్టి రూపము యేర్పడునట్లు పురుషుడు భార్య యొక్క బలిసిన చనుగవ చుట్టూ వృత్తాకారములో పంటిగాటులను యేర్పరిస్తే అది 'గండకము' అనబడుతుంది.

7. వరాహచర్వితము : వరాహమనగా పంది. చరిత్వమనగా తినబడినది. పందులు యేతుంగముస్తెలనో తినుటకై భూమిని ముట్టెతో పెల్లగించుట చూస్తూ ఉంటాము అట్లే పురుషుడు భార్యయొక్క బలిసి ఉన్న చనుగవ మీదను, పిరుదులమీదను దీర్ఘ రేఖలు యేర్పడునట్లు పండ్లతో గాటు పరచినచో అది 'కోలచరిత్వము' అనబడుతుంది.

లోకమునందు భార్యాభర్తలు కామభావ ప్రేరితులైనపుడు ఆలింగన-చుంబన-నఖక్షత-దంతక్షతాదులు వాని అంతట అవే యేర్పడుతూ ఉంటాయి. కాని శాస్త్రము లలితములు, సుందరములు అయిన విధానాలను ప్రస్తావిస్తుంది. నాగరకజనం సర్వవిషయాలను లలితంగా సుందరంగా ఉపాసిస్తారేకాని ఎందునా మోటుదనం కనబరచరు.

పైన చెప్పబడిన దంతక్షతాదుల వలన స్త్రీ పురుషులలోని కామాగ్ని ప్రజ్వరిల్లి వారిలో ఆభ్యంతరరతికి తగిన ఉద్వేగంజనిస్తుంది. ఆలింగన-చుంబన-నఖక్షత-దంతక్షతములనే యీ నాలుగింటికి బాహ్యరతి అని పేరు. సహజంగా పురుషునియందు కంటె స్త్రీయందు