పుట:NagaraSarwaswam.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

103


పెదవితో కొంచెమెరుపుచిందునట్లు నొక్కుట జరిగితే అది గూఢకము అనబడుతుంది. అది కేవలము ఎఱ్ఱదనము అనగా కందియుండుటచే మాత్రమే గుర్తించదగిన స్థితిలో ఉండాలి. లోతుగా గాటుపడరాదు. ఇట్లు నిగూఢమైన స్థితికలిగిన దంతక్షతము 'గూఢకము' అనబడుతుంది.

2. ఉచ్ఛూనకము : ఉచ్ఛూనము అనగా ఉబ్బినది. ప్రియురాలు సమీపమునందుండగా పురుషుడు ఒక్కొక్కపుడు ఉన్మత్తమైన ఆవేశానికి లోనై ఆమెయొక్క రమ్యశరీరభాగములను లలితముగా కాక ఇంచుక ఉబ్బినట్లు గాఢంగా మునిపంటితో పీడించుటకూడ జరుగుతూఉంటుంది. భార్యయొక్క క్రిందిపెదవియందు, ఎడమ బుగ్గ యందు పైనచెప్పినరీతిగా ఉబ్బునట్లు పంటితోనొక్కుట ఉచ్ఛూనకము అనబడుతుంది. ఉబ్బుట దీని ప్రధానలక్షణము. అయినను భార్యయొక్క మిగిలిన శరీరభాగములను విడచి క్రిందిపెదవిని, ఎడమబుగ్గనుమాత్రమే దీనికి తగిన స్థానములుగా శాస్త్రకర్తలు నిశ్చయించారు.

3. ప్రవాళమణి : ప్రవాళమనగా పగడము. పగడము ఎఱ్ఱగా ఉంటుంది. ఉచ్ఛూనకమే మిక్కిలి నేర్పుతో భార్యయొక్క యెడమబుగ్గయం దాచరింపఁబడినప్పుడు ప్రవాళమణి అనబడుతుంది. నేరుపులేకుండ ఈ దంతక్షతము ఆచరింపరాదు.

4. బిందువు : భార్యయొక్క క్రిందిపెదవిని పురుషుడు తన ముందుపండ్లతో (క్రిందిపండ్లతోడను, మీదిపండ్లతోడను ) రెంటితో మాత్రము గాటుపరచినచో అచ్చట ఒక చుక్క ఏర్పడుతుంది. అట్టి క్షతమునకు బిందుక్షతమని పేరు. ఈ నాగరసర్వస్వమునందు బిందుక్షతము మాత్రమేచెప్పబడినది. కాని రతిరహస్యమునందిట్టి బిందువులను వరుసగా ఏర్పాటుచేయుట "బిందుమాల" అనబడుతుందని వేరొక దంతక్షతముకూడ వివరింపబడినది. చూ. రతిరహస్యం.

5. మణిమాల : భార్యయొక్క కంఠము, బుగ్గలు, గుండెలు ఈక్షతమునకు తగినవి. ఈస్థలములయందు పురుషుడు తనయొక్క క్రింది