పుట:Naa Kalam - Naa Galam.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన రాజీవ్‌ పై పగపెంచుకున్నాడు. థాను అనే మానవ బాంబును రాజీవ్‌ హత్యకు వినియోగించాడు. 1991 మేలో ఎన్నికల ప్రచారానికి శ్రీ రాజీవ్‌ గాంధి విశాఖపట్నం నుంచి శ్రీ పెరంబుదూర్‌రాగా, ఆ మానవ బాంబు రాజీవ్‌గాంధికి నమస్కరిస్తున్నట్టు వంగే సరికి నడుంకు కట్టుకున్న బాంబుపేలి, ఆ యువ మహనాయకుని పొట్టను పెట్టుకున్నది! భవిష్యద్భారత ఆశాజ్యోతి ఆరిపోయింది. రాజీవ్‌తో పాటు ఆయన ప్రధాన అంగరక్షకుడు, ఆయన సమీపంలో ఉన్న కాంగ్రెసు కార్యకర్తలు గుర్తుపట్టడానికి వీలులేకుండ ఛిన్నా భిన్నమైపోయారు. ఆ మనోహర సుందర శరీరం గుర్తు పట్టడానికి వీలులేకుండా ఖండ ఖండాలైనది.

ఆ నిశి రాత్రి ఈ భయంకర వార్త తెలియగానే నేను మ్రాన్పడిపోయాను ! ఆ "షాక్‌"కు నాకు గుండె నొప్పి వచ్చింది ! రాజీవ్‌ గాంధికి నేను సన్నిహితుణ్ణి; ఆయన ఉపన్యాసాలను అనువదించాను; ఆయన రాసిన లేఖలు నా వద్ద దాదాపు 40 వరకు ఉన్నాయి. ముఖ్యంగా మృతిచెందడానికి నెల రోజుల ముందు ఆయన నాకు రాసిన లేఖలలో ఆఖరుదానిలో ఆయన తాను కలలుకంటున్న భవిష్యద్భారతాన్ని చిత్రించారు!

ఆ లేఖను నేను పత్రికలకు విడుదల చేశాను. భారత దేశంలోని ప్రధాన ఇంగ్లీషు పత్రికలన్నీ రాజీవ్‌ గాంధి లేఖను ప్రచురిస్తూ, నెహ్రు - గాంధి కుటుంబంతో నాకు అప్పటికి 40 సంవత్సరాల నుంచి సన్నిహిత సంబంధాలున్నవని, పండిట్‌ నెహ్రు, శ్రీమతి ఇందిరా గాంధి, శ్రీ రాజీవ్‌గాంధి రాసిన దాదాపు నూరు లేఖలు నావద్ద ఉన్నవని ఢిల్లీ పత్రికలు పేర్కొన్నాయి.

రాజీవ్‌ గాంధి పై జపాన్‌ టి.వి. వార్తా చిత్రం

శ్రీ రాజీవ్‌ గాంధి అంత్యక్రియల వార్తా విశేషాలను చిత్రించడానికి