పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

మీఁగడ తఱకలు


రచింపఁబడినది. నన్నయాదుల భారతమున కిది దండాన్వయము గాదు. సంస్కృతభారతపు మక్కికి మక్కి గాదు. కథాంశమును జక్కగాc దేటపఱుచు స్వంతంత్రరచనము. ఈకవి తనగ్రంథ ముద్ధతశైలి నుండవలయు నని యపేక్షింపక, సర్వసామాన్యముగా నర్థమగునట్లుండవలయు నని తలంచి, తలంచినట్లే నిర్వర్తించెను. ఈ గ్రంథమున నెక్కడను బిగువుదక్కి నీరసముగా నుండుకూర్పు కాన్పింపదు. కొంతవచనభాగమును మచ్చు చూపుచున్నాఁడను.

"కుమారకా! యేను జాత్యంధుండ నయినను బాండు భూపాలుండు నన్ను మిగులం బూజించె. అది యె ట్లంటేని, లోచనంబులు లేమింజేసి పరదళంబుల మొగ్గరంబులు పన్ని యగ్గలిక మెఱయ గెలువంజాల, స్వరాష్ట్ర పరిపాలనంబున కసమర్దుండ. సాంగంబులుగ వేదంబులను రాజనీతిశాస్రంబులు నధికరించితి. ఎంత యుధికరించిన నేమి ప్రయోజనంబు? క్షత్రియుండగువాఁడు ధర్మమార్గంబుదప్పక సమరంబు గావించి హతుం డయ్యెనేని స్వర్గంబున కరుగు. జయించినఁ గీర్తియును భూమియుం బడయుగావున నాయుధోపజీవుల కాయోధనం బవశ్యకర్తవ్యంబు అట్లు గెలిచి, పుత్త్రులయెడ నైశ్వర్యంబు నిలిపి, వనవాసంబున కరుగగలయు నిట్టి కర్మంబున కే నసమర్థుండ నయినను బాండునృపాలుండు నన్ను రాజ్యంబున నిలిపి, తాను దిగ్విజయంబుసేసి, సకలధనంబులు నా యధీనంబులు గావించె. అతండు నన్నురాజ్యంబున నిలుపుటకు ధర్మంబు కారణం బగుంగాని వేఱొండు నిమిత్తంబు లేదు. క్షత్రియులకుఁ బుత్రు లెంద ఱున్నను, దేజో౽ధికుండ జ్యేష్ఠుం డగుంగాని వయో౽ధికుండు జ్యేష్ఠుండు కానేరండు. అట్లు గావునఁ దేజో౽ధికుం డగుపాండు నృపాలుండు వయఃక్రమంబునఁ గనిష్ఠుండయ్యు జ్యేష్ఠుం డనంబడు, నతనికుమారులు వేదశాస్రంబులు చదివి, సకలార్ధంబులుఁ దెలిసి, గుణంబులం బ్రసిద్దులగుచు నస్త్రాభ్యాసంబు సేసి, లోకద్వయంబునం