పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

43


నానావిధానేకాంతర్బాహ్యాదిశాత్రవ మేఘౌఘ జంఝానిల, పరరాజగర్వాంధ కారవిదళనదినరాజదళవాయి 'దొడ్డరాజతనూజ' యాచకసురభూజ భుజబలాటోప పరాజితారిరాజన్య సమర్పితానేక రత్నరాశియుత ధనకనక వస్తువాహనాదిసువస్తువిస్తారిత సంతోషితాఖిల భూసురాశీర్వాదానువర్ధిత పుత్రపౌత్రాది వంశాభివృద్ధి విరాజమాన, 'కళవేకుల వంశాంబుధి రాకానిశాకర' ఆశ్వలాయనసూత్ర, పరమపవిత్ర భారద్వాజగోత్ర ప్రదీపకాసేతుశీతాచలమధ్యవర్తికా శీప్రభృతిపుణ్యక్షేత్ర నిత్యాన్నదానాద్యనేక ధర్మశాస్త్రోక్తదానదీక్షావిచక్షణ, క్షాత్రాధీశ్వర కార్యఖడ్గప్రవీణ అనవధికా గ్రహారగృహారామక్షేత్రాదిసంతోషితాఖిలకవిరాజ, శ్రీవీరరాజ ప్రణీతం బైనమహాభారత వచనకావ్యమునందుఁ బ్రథమాశ్వాసము."

ఈ చదువఁబడిన గద్యమువలన నీగ్రంథమును రచించిన యాతఁడు మైసూరుప్రభు వగుచిక్కదేవరాయలయొద్ద దళవాయి యయిన దొడ్డరాజు కుమారుఁడగువీరరా జని తెలియుచున్నది. మైసూరుప్రభువులలోఁ జిక్కదేవరాయలు మిక్కిలిప్రఖ్యాతుcడు. ఈతనిఁగూర్చి సంస్కృతాంధ్ర కర్ణాటభాషలలోఁ గొన్నిగ్రంథములు రచింపఁబడెను. తెలుఁగునఁ జిక్కదేవరాయవిలాసమును నింక ననేకచాటుపద్యములును గలవు. ఈతఁడు 1650 తర్వాత 1700 లోఁగా రాజ్యమేలెను. ఇంచుమించుగా మనగ్రంథకర్తయు నాకాలముననే యుండును. ఈకవి తాను ఆశ్వలాయన సూత్రమును భారద్వాజగోత్రమును గల క్షత్రియుఁ డయినట్లు చెప్పుకొనెను. ఈతని దాతృత్వాదికమును, ఈతని జనకుని ప్రతాపాదికమును గద్యమువలనఁ దెలిసికొననగును. ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమున నప్పకవీయమునకు రూపాంతరమై వీరభూపాలీయ మనునొక లక్షణగ్రంథము గలదు. కూర్చినగ్రంథకర్తపే రందుఁ దెలియుట లేదుగాని యసమగ్రమై యూదిపర్వముమాత్రమే చూపట్టుచున్నది. ఇయ్యది శ్రీకృష్ణాంకితముగాc దేనియ తేటవోలె సారస్యము గల తెలుఁగు వచనమున