పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

143

సామ్రాజ్యలక్ష్మీపీఠికాతంత్ర మని యొక గొప్పతంత్ర గ్రంథము తంజాపురపు సరస్వతీపుస్తకభాండాగారమం దున్నది. రాజధర్మములు వారి దినచర్యాదులు మిక్కిలి చక్కఁగా బ్రశంసింపఁబడినవి. రాజాస్థానమునఁ బండితగోష్ఠి నెట్లు నెఱపవలయునో - విద్వద్వివాదము నెట్లు నడుపవలెనో - జయించినవారి కెట్టిసత్కారము కావింపవలెనో యం దున్నది. విద్వద్వివాదమందు విజయ మందినవారికిఁ జేయఁదగినసత్కారములలోఁ గనకాభిషేక మొకటి. అభిషేకించిన స్వర్ణముద్రికాదుల నప్పు డచ్చటికి విచ్చేసియున్న పండితులకుఁ గవులకుఁ దదితరులకుఁ బంచిపెట్టవలె నఁట! ప్రాచీనపండితగాథలను బరిశీలింపఁగా నీకనకాభిషేకసత్కారముఁ గాంచినవా రాంధ్రులే పెక్కు రగపడుచున్నారు. ఈ వంశమువాఁడే యగుపెద్దిభట్టు, శ్రీనాథుఁడు మొదలగువారు.

ఈ మల్లినాథునికొమారుఁడు కపర్ది, ఈతఁడు శ్రాతసూత్ర కారికావృత్తికారుఁ డని, మంత్రవేత్త యని చెప్పఁబడినది. కపర్దిస్వామి వైదికబృందమునకు సుపరిచితుcడు. ఆపస్తంబగృహ్యసూత్రాదులకు భాష్యములను రచించెను. కపర్దికారిక లని చెప్పఁబడెడుగృహ్యకారికలను రచించిన కపర్దిస్వామి యీతఁడే కావలెను. కపర్దిస్వామి గ్రంథము లివి తెలియవచ్చుచున్నవి. ఆపస్తంబగృహ్య సూత్రభాష్యము, ఆపస్తంబగృహ్య పరిశిష్టభాష్యము, ఆపస్తంబశ్రౌతసూత్రభాష్యము, దర్శపూర్ణమాసభాష్యము, భారద్వాజగృహ్య సూత్రభాష్యము, ఆపస్తంబగృహ్యకారికలు. ఇందు ఒకటి రెండుకంటె నెక్కువగ్రంథము లచ్చుపడలేదు. ఈతఁ డాంధ్రుcడు, కొలచెలమవంశమువాఁడు నగుట యిదివఱకుఁ బ్రఖ్యాతముగా నెఱుకపడిన విషయము కాదు. ఈయన కిద్దఱు కుమారులు. పెద్దవాఁడు మల్లినాథుఁడు. జ్యేష్ఠుఁ డగునీమల్లినాథుఁడు విద్వాంసుఁడుగాఁ జెప్పఁబడలేదు. కనిష్ఠుఁడు పెద్దిభట్టు. ఈతఁడు మహోదయుఁ డని- సర్వదేశములందును మహోపాధ్యాయుఁడుగా విఖ్యాతిఁ గాంచె నని - సర్వజ్ఞ (సింగ) భూపాలునిచేఁ గనకాభిషేకసత్కారము గాంచె నని - గణాధిపప్రసాదముచే