పుట:Manooshakti.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53

రా ! మనోశక్తిని సంపాదించుటకు వాడుకచేయునపుడు శతవిధముల పారుడునీటియందు జలకమాడుట శ్రేష్ఠము. రెండవపక్షమున కూపజలముగూడ తగినవసతులున్న యొకవిధమున మంచిదనియే నాయభిప్రాయము. ఇట్లు నీవు స్నానమాచరించునపుడు జలమునందుండు మంచిశక్తి నీలో ప్రవేశించుచున్నదనియును, తత్కారణమున నీశరీరమంతయు పదారువన్నె బంగారువలె మెఱయుననియును దలంచుచు నీకెన్నడును దేహవ్యాధి గలుగదనియును మిక్కిలి దృఢముగనమ్ముచు సాధనము చేయుచుండుము. స్నానముజేయునపుడు ప్రతియవయవమును శుభ్రముగా తోముకొనుచు సుమారొక యరగంట కాలమువరకు జలకమాడుట ముగింపవలెను. ప్రతిదినమిట్లు చేయుచుండిన శరీరమంతయు బంగారుచొక్కాను తొడిగికొన్నట్లు తళతళమెఱయుచు బుద్దిబలము పెంపొంది యంగబలము నందు మిక్కిలి వృద్ధినిబొందినవాడవై చూచువారల కెల్లరకును కన్నులపండువుగ నుండునట్లు గాన్పించుచుందువు. ప్రతిదినమును పైనవచించిన విధమున స్నానమాచరించుచు మనోశక్తికై యభ్యాసము చేయవలెను. అట్లుచేసినవాడు త్వరలో యీశక్తిని పడయుదురని నేను నొక్కి వక్కాణింపగలను. దొంగలు నీవెంటబడి కొట్టవచ్చినప్పుడు నీకడ్డమువచ్చిన పెద్ద కాలువలను సయితము దూకగలుగుచున్నావు. కారణమెద్ది యన దొంగలు వెంటపరుగిడివచ్చునప్పుడు నీవు పారిపోపు చుండగనే కాలువడ్డుపడినను దూకగలవను ధైర్యముచే యవలీలగ దూకుచున్నావు. కాబట్టి యిచ్చట నీమనోశక్తిని యు