పుట:Manooshakti.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

పానయోగ్యమగు నీటిని దెచ్చుకొనుటకై ప్రత్యేకముగ, నొక చెఱువుండినవారి విషయమై చెప్పవలసిన దంతగా లేదుగాని త్రాగుటకు తెచ్చుకొను తటాకమునందే బట్టలనుతుకుటయు, స్నానముచేయుటయు , పశువుల కడుగుటయు, వలలువేసి చేపలను బట్టుకొనుటయు మొదలగు దురాచారములు గలిగిన గ్రామారోగ్యమునుగురించి చెప్పునప్పుడు తిన్నయన్నమంతయును వెలికివచ్చుటకు ప్రయత్నించుచుండునుగదా ! కాన చదువరులారా ! మీగ్రామమునటువంటి యలవాటు లుండినచో వాటిని లేకుండజేయ ప్రయత్నింపుడు. లేక యటువంటి చెఱువులకు ప్రక్కలనే భావులను త్రవ్వించి యందుండి యూరుచుండెడి జలమును పానయోగ్యముగ నుపయోగించిన మరికొంతవరకు బాగుండును. మీగ్రామమునందు నీమాటవినరని నీకు భయముండినచో మనోశక్తిని సంపాదించి వారికందరకును నీవుజెప్పు హితోపదేశములను సరిగా నుండి వినునట్లు జేయుము. తద్వారా నీవనేకమందికి మేలొనర్చిన వాడవగుదువు.

స్నానములు మొదలైనవిజేయు ముఱికి చెఱువులయందు నీటిని త్రాగుటకుగూడ నుపయోగించెడు గ్రామముల యందు నివసించువారెల్లరును సామాన్యముగ నెద్దియో నొక రోగముచే నిరంతరము బాధపడుచుండుట నిశ్చయము. ఇటువంటి గ్రామములను పెక్కింటిని నేనుచూచియున్నాను. నేను చెప్పినట్లుగనే సామాన్యముగ ప్రతివారును యెద్దియో నొక రోగముచే బాధపడుచుండుటయు గలదు. చదువరులా