పుట:Manooshakti.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

పయోగించియుంటివి. అందువలన దూకగలిగియున్నావు.

నేనొకనాటి సమయమున నాప్రాణమిత్రుడగు కొత్త సీతారామయ్యగారితో జాగర్లమూడిగ్రామమువరకు సాయంతనమున మాటలాడుచు వెళ్ళి మరల సూర్యాస్తమయమగు సమయమున బయలుదేరి కరీమ్ సాహేబు అనువాని గుఱ్ఱపు బండిలోనెక్కి వచ్చుచుండగ మార్గమునందొక త్రాచుపాము కాలవశమున బండివాని కంటబడెను. పిమ్మట వాడు భీతినిజెంది బండినాపి నాకాకృష్ణసర్పమును జూపించెను. ఇట్లుండ మరికొంతమంది ప్రయాణీకులు గుమిగూడి పాము పడగవిప్పి యాడుచుండుటచూచి మిక్కిలి భయమును జెందుచుండిరి. అట్టిసమయమున నేనుబండినుండి దిగి చల్లగా పామును సమీపించితిని. అచ్చటనున్న వారందరు నన్ను బోవలదని యఱచు చుండిరి. వారిట్లఱచుచున్న సమయమున నాశక్తి నాపాముపై యుపయోగించితిని. అచ్చటనున్న వారందరును వింతజెందునట్లుగ పామాడక పడగనుమూసికొని చల్లగా భూమిపై పరుండెను. పిమ్మట నేను పామును సమీపించి కొంచెముసేపు దువ్వి యాడించియుంటిని. చూడవచ్చినవారిలో నొకడు నావెనుక భాగముగవచ్చి దుడ్డుకఱ్ఱతో నొక్కదెబ్బను చచ్చునట్లుగ బాది యంగలకుదురునకు సమీపముననున్న కాల్వలో బడవైచెను. ఇట్లే నేననేక పర్యాయములు పాములనాడించి జనులందర కాశ్చర్యమును పలుమారు గావించియుంటిని. చదువరులారా ! మీరుగూడ మనోశక్తియను మెస్మరిజమును నేర్చుకొని జనులకు మేలుజేయుటకై పాటుపడుచుండుడు.