పుట:Manooshakti.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47

వీరందరును స్కూలు విడచినతోడనే నాగదివద్ద హాజరుగా నుండెడివారు. ఇట్లుండ నొకనాటి సమయమున నీమిత్రబృందములో నొకడగు చల్లా గోపాలరావుగారితో నెవరో యొక విద్యార్థి మెస్మరిజమనిన నెంతమాత్రమును నమ్మకములేదని పలుమారాతనితో పలుకుచున్నాడనియును తత్కారణమున నాతనికెద్దియో నిదర్శనము ప్రత్యక్షముగ జూపించవలెననియును నన్నుకోరగా నేదియోనొకటిజేయ మొదలిడుచుండ నచ్చటనున్న మరికొందరు మిత్రులతని నేడ్చునట్లు జేయుడని కోరగా నతనికి జేసినచో నతని కేమియును దెలియదని యాతనిసోదరుడేడ్చునట్లు జేసియుంటిని. పిమ్మట మరికొన్ని వినోదములనుజేసి యాతనికి మెస్మరిజమునందు మిక్కిలి నమ్మకమును గలుగ జేసియుంటిని.

విభూతియొక్క గొప్పశక్తి.

సాధారణముగ భూతవైద్యులందరును విభూతిని వాడుచుండుట ప్రతివారును చూచుచునే యున్నారు. మన ముపయోగించునటువంటిశక్తి విభూతిలో త్వరగా ప్రవేశించి రోగియొక్క దేహమును తాకినవెంటనే యామంచిశక్తి యందులో ప్రవేశించి యాతని చెడుశక్తిని వెళ్లగొట్టును. మరియు విభూతిని కనుబొమలకుమధ్య బెట్టుచు మరికొంత భాగమును లోపలకుగూడ పంపుచుండుట పలుమారు చూచుచున్నాము. దీనికి కారణం బేమియన ముఖమునందు శక్తిని త్వరలో గ్రహించు నరములున్న వని మనపూర్వీకులు గ్రహించియుండుటచే విభూతి నచ్చట బొట్టుగానుపయోగించిన మనమావిభూ