పుట:Manooshakti.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

తియందు ప్రవేశింపజేసిన శక్తి ముఖనరములద్వారా దేహమునందు ప్రవేశించి రోగిని త్వరలో స్వస్థతగావించుచున్న ది. మరియు నోటిలో వేసికొని తినిన యెడల గర్భమునందాహారముతోగలసి రక్తముగామారి దేహమునందెల్లభాగములకును మనముపయోగించిన శక్తి ప్రవేశించి రోగమును కుదుర్చుచున్నది. భూతవైద్యులు విభూతినితీసికొని మంత్రించి యిచ్చుదురు. ఆవిభూతిని మంత్రించునప్పుడు దానియందర్థమిది : “భూతపిశాచములచేగాని జడిసినందువలనగాని ప్రవేశించిన చెడుశక్తి నీయందుండి తొలగిపోవుగాక. నేటినుండి నీవారోగ్యముగా నుందువుగాక" అని భూతవైద్యునియొక్క మనోశక్తి నుపయోగించి యిచ్చును. ఇట్లే నాశక్తిని విభూతియందు ప్రవేశింపజేసి పలువురను నిద్రబారినుండియ , సోమరితనమునుండియు, తలనొప్పినుండియు తొలంగించి యుంటిని,

దూరముననున్న వా రేమిచేయునదియును జెప్పుట.

నీవు ప్రతిదినమును నిద్రనుండి లేచినతోడనే తూర్పుముఖముగా గూరుచుండి నీమనసునం దేమియు తలంచకుండ (Thoughtless) గా కొంచెము సేపనగా సుమారు రెండు నిమిషములకాల ముండుము. ప్రతిదినమిట్లు వాడుకచేయుచున్న సుమారొక నెలదినంబులకు నీమనసునకొక శక్తి గలుగును. ఈ యభ్యాసమును చేయుటకు మొదట నీకు మిక్కిలి స్నేహము గలవానిని సమీపమున నున్న గదిలోనికిబంపి యెద్దియో నొకచేతిలోవస్తువు నొకదానిని పెట్టుకొనుమని చెప్పుము. తదనంతరము నిశ్చలచిత్తముతో నీవు కొంచెము సేపూరకుండి