పుట:Manooshakti.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

“ఓ బెల్లమా నీయందు తీపిలేదు. నిన్నెవరైన నోటిలోవేసికొన్న పేడవలె నుందువుగాక” అని నీలోనీవు కొంతసేపు తలంచి, పిమ్మట నీవద్దనున్న వారికి కొంచెముకొంచెముగా బెట్టుము. ఆహో, యిదేమి యాశ్చర్యము. బెల్లమును నోటిలో వేసికొనగా పేడవలెనున్న దని యందరాశ్చర్యమొందెదరు. ఆహా! బెల్లమును పేడగను పేడను బెల్లముగను మార్చుటెంతవిపరీతము ! పూర్వము భీమకవిని బ్రాహ్మణులు భోజనపంక్తికి రానివ్వని కారణంబున గోపమునుజెంది, అప్పాలెల్లను కప్పలుగావలే ననియును, అన్నమెల్ల సున్నముగావలెననియును, అయ్య లెల్ల కొయ్యలుగావలెననియును పలికినమాత్రమున ప్రతిదియు నట్లే మారెనని చెప్పు వాడుక పిన్న పెద్ద లందరకును దెలిసిన విషయమై యున్నది. ఈమాటలు విన్నప్పుడు కొందరజ్ఞానులు సర్వాబద్ధమనియును, వేడుకార్థమై దీని నెవ్వరో గల్పించిరనియును బల్కుచుందురు గాని యట్టిమూర్ఖులు నీవీ బెల్లమును పేడగమార్చుట చూచినప్పుడైన నిజమని తలంపరా? “కఠినచిత్తమెపుడు కరగింపగారాదు” అనిచెప్పినప్రకారము కొంతమందిమూడు లప్పటికిని నీవేదో గారడీచేయుచున్నావని నమ్మకుండుటగూడ నొకానొక సమయమున తటస్థించును. అట్లు నమ్మనివానిని యతనిచేతనే బెల్లమును తెప్పించి యాతనిచేతనే యుంచుకొమ్మనిచెప్పి నీమనోశక్తి నాబెల్లముపై పైనుదహరించిన విధమున నుపయోగించుము. తదనంతరము నీకాబెల్లము పేడగా మారినదని తోచినప్పుడు తినుమని చెప్పుము. అహో యతనియవస్థనేమని చెప్పుదును. నోరంతయును