పుట:Manooshakti.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43

మురిగిన పేడవలె కంపుగొట్టుచు బహు యసహ్యకరముగనుండును. కాన యాతనికిట్లు పైనవచించిన మాడ్కి ప్రాయశ్చిత్తమునుజేసి పంపినయెడల వానికి నమ్మకము గల్గును. ఇట్లు నేననేకపర్యాయములు పెక్కు మూర్ఖులకు ప్రాయశ్చిత్తములు జేసియుంటిని. కాని వారిపేరిచ్చట యుదహరించుట భావ్యము గాదని మానివేసితిని. ఇటువంటి వినోదములను పెక్కింటిని నేను తెనాలిపురమునందున్నప్పుడు నామిత్రులకందరకును పలుమారు చూపించుచుంటిని.

చేతిలోని చీట్లపేకముక్కను చేతిలోనె మార్చుట.

చీట్లపేక నొకదానినిదెప్పించి బాగుగ గలిపించి చూడవచ్చినవారిలో నొకనిని ముక్కను దీసికొనుమని చెప్పి యందరకును చూపింపుమనుము. నీవుగూడను చూడుము. పిమ్మట సోదరులారా, యీముక్కను మీరును నేనునుగూడ చూచియేయున్నాముగదా. దీనిని బహుజాగ్రత్తగ మీలో నొకని యొద్ద దాచియుంచుమని యడుగుము. తరువాత నీలో నీవు మనసునం దీక్రిందివిధముగ ననుకొనుము. "ఇప్పుడాతనియొద్ద దాచియుంచినది కళావరు జాకియేయని పలువురుజూచియున్నను చూచినముక్క మాత్రముగాక మరొకటి కావలెనని దృఢముగ దలంచుచుండుము. ఆహా, యేమి నీమనోశక్తి యొక్క ప్రభావము ! ప్రతివారికిని కనులను కప్పుచున్నదే ! ఈ వింతను జూచిన యెట్టిమానవుడైనను మనోశక్తిని నమ్మకుండునా ? అప్పటికిని నమ్మకుండిన నేను పైనవ్రాసిన ప్రాయశ్చిత్తమును జేసి బంపుచుండుము. అప్పటికి గానివానికి నమ్మకముబుట్టదు.