పుట:Manooshakti.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(6)

41

పోగొట్టి వానిని సంతోషముజెందునట్లు చేయగలుగుదువు. నీ స్నేహితుడు తలనొప్పిచే బాధపడు చుండగ యాతనిని బాధనుండి నీమనోశక్తివల్ల తొలగించి సంతోషమును గలుగజేయుటకన్న నీ కెక్కువ ప్రీతికరమైనదెద్ది? ఇట్లనేకమారులు నాస్నేహితులు బాధపడుచుండగ నేను పలుమారు సులభముగా బాగుజేసియుంటిని. ఒకనాటిసమయమున నాకు మిత్రుడగు కొసరాజు లక్ష్మయ్య తలనొప్పిచే బాధపడుచున్న సమయమున నేనాతని గదికి వెళ్ళుట తటస్థమాయెను. అందువల్ల నేనాతని తలభారమును సులభముగా దీసి వేసి సంతోష పెట్టగలిగియుంటిని. నేను తెనాలిపురమున నున్నప్పుడు చాలమందికి బాగుజేసియుంటిని గాని వారినందర నిచ్చటుదహరించు టనవసరముగా నెంచి వ్రాయుట మానినాడను. తలనొప్పిచే బాధపడుచున్నవానిని నీకెదురుగా గూరుచుండబెట్టి యాతని కనుబొమలమధ్య జూచుచు "నీతలనొప్పి తగ్గిపోవును,” అనిదృఢముగా మనసునందు తలంచుచు ముఖముపై చల్లగానూదుచు తగ్గినదాయని మధ్యమధ్య నడుగుచుండుము. ఇట్లుజేసిన సుమారైదారు నిమిషములకంతయు తలనొప్పిపోయి మిక్కిలి సంతోషముగానుండును. ఇట్లే పార్శ్వపునొప్పులను పోగొట్టవలసివచ్చినయెడ కణతలను జూచుచు పైవిధముగ నీమనోశక్తి నుపయోగించుము.

బెల్లమును పేడగా జేయుట.

నీవొకనితో బెల్లము నందరుజూచుచుండగనే దెప్పించి నీచేతనుంచుకొని దానియందు నీమనోశక్తి నుపయోగించుము.